నేటి రోజుల్లో మద్యపానం తాగే అలవాటు అనేది ఎంతో కామన్ గా మారిపోయింది. ఒకప్పుడు ఎవరికైనా మద్యం తాగే అలవాటు ఉంది అంటే చాలు వాళ్ళు చెడ్డవాళ్ళు అన్న విధంగానే అందరూ చూసేవారు. కానీ నేటి రోజుల్లో ఎవరైనా మద్యం తాగే అలవాటు లేదు అని చెబితే చాలు వాళ్ళని విచిత్రంగా చూసేస్తూ ఉన్నారు. ఎందుకంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా నేటి రోజుల్లో మద్యం తాగడం అలవాటు చేసుకుంటున్నారు అని చెప్పాలి.


 అయితే మద్యం ఆరోగ్యానికి హానికరం అన్న విషయం అందరికీ తెలిసినప్పటికీ ఎందుకు ఇక మధ్యాహ్నం తాగకుండా ఉండడానికి ఎవరు ఇష్టపడటం లేదు. సంతోషం వచ్చినా బాధ వచ్చిన.  శుభకార్యం జరిగిన చెడు కార్యం జరిగిన ఏమి జరిగినా కూడా తప్పనిసరిగా మందు ఉండాల్సిందే. మందు లేకుండా నేటి రోజుల్లో ఏ చిన్న ఫంక్షన్ కూడా జరగడం లేదు అనడంలో ఇలాంటి సందేహం లేదు. అయితే కొంతమంది ఇలా మద్యానికి బానిసగా మరి పోయి చివరికి జీవితాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. ఇక ఇలాంటి పరిస్థితితో ఎన్నో కుటుంబాలు రోజున పడుతున్నాయి అన్న విషయం తెలిసిందే.



 అయితే కొంత మంది ఇక దృఢనిశ్చయం తో మద్యం మానేయాలని అనుకుంటారు. అప్పటి వరకు ఫుల్లుగా మద్యం తాగిన వారు ఒక్కసారిగా ఆల్కహాల్ కి దూరం అవుతారు. అయితే ఇలా ఉన్న ఫలంగా మద్యం మానేయ్యడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ నిపుణులు చెబుతున్నారు. సడన్గా మద్యం మానేస్తే పలువూరిలో మానసిక ఇబ్బందులు కోపం పెన్షన్ అలసట అయోమయం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీనినే విత్ డ్రాయల్ సిండ్రోం అంటారట. కొన్నిసార్లు న్యూరోలాజికల్ సమస్యలతో మతిమరుపు కూడా వస్తుందని పేర్కొంటున్నారు. అందువల్ల కుటుంబ సభ్యుల సహకారంతో దశల వారీగా మందు మానేయాలి అంటూ సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: