మానవుని శరీరంలో మెదడు చాలా కీలకమైన పాత్ర పూర్తిగా మానవుని శరీరం ఆదినంలో ఉంచేలా చేస్తూ ఉంటుంది.. మెదడు సరిగ్గా పని చేయకపోతే అంతే సంగతులు.. ముఖ్యంగా బ్రెయిన్ సరిగ్గా పనిచేసేందుకు సరైన పోషకాలు కావాలి అలాగే యోగ, మెడిటేషన్ వంటివి కూడా అప్పుడప్పుడు చేయడం వల్ల చాలా ఉపయోగం కలిగి ఉంటుంది. అయితే మెదడుకు కూడా హాని కలిగించే కొన్ని పదార్థాలు ఉంటాయట వారి గురించి ఇప్పుడు మనం చూద్దాం.

చేపలు ఆరోగ్యానికి చాలా మంచిదే కానీ ఇందులో ఎక్కువగా మెర్క్యూరీ లెవెల్స్ ఉండడం వల్ల మెదడు పూర్తిగా దెబ్బతినేలా చేస్తాయట. వేటాడే చేపలను అతిగా తినడం చాలా ప్రమాదమట. ఇందులో పాదరసం ఉండడమే కాకుండా ఇది మానవుని శరీరాన్ని కూడా నాశనం కలిగించేలా చేస్తుంది. ముఖ్యంగా మానవుని శరీరంలో ఉండే నాడీ వ్యవస్థ పైన చాలా ఎఫెక్టివ్ గా చూపిస్తుంది.


ఆల్కహాల్ శరీరానికి ఏమాత్రం తాగడం మంచిది కాదు ముఖ్యంగా మెదడు పైన చాలా ప్రభావాన్ని కూడా చూపిస్తుంది. బ్రెయిన్ వ్యాల్యూ ని కూడా తగ్గిస్తుంది. విటమిన్ -B-12 లోపించడం కూడా జరుగుతుందట దీని కారణంగా వెర్నియర్ ఎన్ సేఫలోపతి కూడా రావచ్చు ఇది సోకితే బ్రెయిన్ పూర్తిగా దెబ్బతింటుంది ఫలితంగా ఎవరిని గుర్తుపట్టలేరు మెమొరీ లాస్ పేషెంట్గా మిగిలిపోతారు.


అలాగే చాలామంది ఈ మధ్యకాలంలో మైదా పిండి వంటలని ఎక్కువగా తింటున్నారు. ఇందులో కార్బోహైడ్రేట్లో ఎక్కువగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బ్రెయిన్ కి చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇలాంటి అల్ట్రా ఫాస్టెడ్ ఫుడ్ తినడం వల్ల షుగర్ లెవెల్స్ అమాంతం పెరగడంతో పాటు మెదడు పైన కీలకమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆకలి నిండిన భావం కలిగించినప్పటికీ పిల్లలను పెద్దలలో చాలా ఎఫెక్టివ్ గా చూపిస్తుందట.


అలాగే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న డ్రింక్స్ ని తాగడం చాలా ప్రమాదం అలాగే సోడా , స్పోర్ట్స్ డ్రింక్ ఎనర్జీ డ్రింక్ చక్కర శాతం ఎక్కువగా ఉండేవి తాగకపోవడమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: