ఇటీవల కాలంలో కొత్త ట్రెండు ఏదైనా తెరమీదకి వచ్చింది అంటే చాలు యూత్ అందరూ కూడా దానికి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు అన్న విషయం తెలిసిందే  అయితే ఇలాంటి కొత్త పోకడలు మంచివా చెడ్డవా అన్న విషయాన్ని పక్కన పెట్టి ఇక ఆ ట్రెండును ఫాలో అవ్వడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. అయితే నేటి రోజుల్లో అక్కడ ఇక్కడ అనే తేడా లేదు ప్రపంచవ్యాప్తంగా యూత్ బాగా ఫాలో అవుతున్న ట్రెండ్స్ లో అటు టాటూ వేసుకోవడం కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే.


 ఒకప్పుడు టాటూ లకు కాస్త దూరంగానే ఉండేవారు యువత. ఈ మధ్యకాలంలో మాత్రం టాటూ వేసుకోవడం అనేది ఒక స్టైల్ అని భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తమకు నచ్చిన డిజైన్ ను టాటూగా వేయించుకోవడం చేస్తున్నారు. అలా టాటూలు వేసుకుంటే తాము ఇంకా స్టైలిష్ గా కనిపిస్తామని నమ్ముతున్నారు. అయితే కొంతమంది ఎక్కడో చేతికో కాలికో టాటులు వేయించుకుంటుంటే ఇంకొంతమంది మాత్రం ఒళ్లంతా టాటూలు వేయించుకొని ఏకంగా మనుషులు కాదు రాక్షసులేమో అన్న విధంగా కనిపిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇలా టాటూలు వేసుకుంటే ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తాయా.. లేదా అన్న విషయం ఎవరికీ తెలియదు.


 అయితే ఇలా టాటూలు వేయించుకోవడం కారణంగా ఏకంగా బ్లడ్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాటూలతో లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ వచ్చే ముప్పు 21% అధికంగా ఉంటుందని స్వీడన్ సైంటిస్టులు ఇటీవల వెల్లడించారు. 20 నుండి 60 ఏళ్ల వయస్సున్న 11905 మందిపై అధ్యయనం చేశారు నిపుణులు. చర్మంపై టాటూ ఇంకు పడగానే రోగ నిరోధక వ్యవస్థ ప్రభావానికి గురవుతుందట. చర్మం ద్వారా ఇంక్ లింప్ నోడ్స్ లో పేరుకుపోయి.. చివరికి లింపోమా క్యాన్సర్ రావచ్చు అని చెబుతున్నారు నిపుణులు . అయితే టాటూ సైజును బట్టి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుందని.. ఇక రానున్న రోజుల్లో దీనిపై మరిన్ని పరిశోధనలు జరుపుతాము అంటూ నిపుణులు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: