టెక్నాలజీ పెరిగిపోయే కొద్దీ ప్రతి విషయంలోనూ కల్తి అనేది కూడా ఎక్కువగా పెరిగిపోతూ వస్తుంది . మరీ ముఖ్యంగా పసిపిల్లలు తాగే పాలు విషయం దగ్గర నుంచి ముసలి వాళ్లు వేసుకునే మెడిసిన్స్ వరకు ప్రతిదీ కూడా కల్తీ అయిపోతుంది . మార్కెట్లో నకిలీ మందులు హల్చల్ చేస్తున్నాయి అన్న విషయం బయటపడింది . ఉత్తరాది లోని కాశీపూర్ ..ఘజియాబాద్ ..ప్రయాగ్రాజ్ తదితర ప్రాంతాలలోనే కాకుండా హైదరాబాద్ నగరం కేంద్రంగా కొన్ని నకిలీ మందులు తయారు చేస్తున్నట్లు అధికారుల సోదాల్లో తేలింది . కాగా ఈ మధ్యకాలంలో చాలా మందికి థైరాయిడ్ సమస్య పట్టిపీడిస్తుంది.


చిన్నకాదు పెద్ద కాదు అందరినీ థైరాయిడ్ సమస్య బాగా వేధిస్తుంది.  ఇదే అదునుగా చూసుకొని కొంతమంది డబ్బు సంపాదించడానికి తప్పుడు మార్గాలను చూస్ చేసుకుంటున్నారు. ఎక్కువమంది కొనుగోలు చేసే ఖరీదైన మందులను కల్తీ చేస్తున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో థైరాయిడ్ మెడిసిన్స్ ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి.  నిబంధనల ప్రకారం ఎక్కువగా అమ్ముడయ్య టాప్ బ్రాండ్ మందులపై విడి గా క్యూఆర్ కోడ్ ..బార్కోడ్ ఉంటాయి.  కానీ విక్రయించే సమయంలో స్కాన్ చేస్తే అది అసలు దా..? నకిలా దా అని ఇట్టే తేలిపోతుంది .



కొంతమంది మాత్రం అలా బార్కోడ్ చెక్ చేసుకోకుండానే టాబ్లెట్స్ కొనుగోలు చేస్తూ ఉంటారు. రీసెంట్గా థైరాయిడ్ మెడిసిన్స్ లో భారీ స్కాం జరిగినట్లు బయటపడింది. అసలు ఒరిగినల్ దానికి ఏ మాత్రం తీసిపోని విధంగానే నకిలీ ట్యాబ్లేట్స్ తయారు చేస్తున్నారు. దీంతో అధికారులు అలెర్ట్ అయ్యారు.  ప్రతి ఒక్క వినియోగదారి మందులు కొనుగోలు చేసినప్పుడు దాని పై ఉండే క్యూర్ కోడ్ ని స్కాన్ చేస్తే అది అసలైనదా..? లేక నకిలీదా..? అని తేలిపోతుంది అని ఒకవేళ స్కాన్ చేసినప్పుడు బ్రాండ్ పేరు ..తయారీ ప్రాంతం.. తేదీ బ్యాచ్ ..నెంబర్ ..తేదీ.. లైసెన్స్ ..నెంబరు ప్రత్యక్షం కాకపోతే అది నకిలీదిగా గుర్తించాలి అని అధికారులు చెప్పుకొస్తున్నారు . క్యూఆర్ కోడ్ లేకపోయినా వాటిని స్కాన్ చేసిన తర్వాత వివరాలు కనిపించకపోయినా అది నకిలీ మందుగా గుర్తించాలి అని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.  2023 నుంచి ఇప్పటివరకు పట్టుకున్న నకిలీ మందులు విలువ దాదాపు 1.73 కోట్లు దాటేసింది అంటే ఎన్ని నకిలీ మందులు బయటకు వచ్చేసాయో అర్థం చేసుకోవచ్చు..!

మరింత సమాచారం తెలుసుకోండి: