ఈ మధ్యకాలంలో చిన్న వాళ్లు కూడా బాధపడేది షుగర్ కారణంగానే.  25 ప్లస్ రాగానే షుగర్ ఎటాక్ అయిపోతుంది.  మరీ ముఖ్యంగా దానికి కారణం పెరిగిపోతున్న ఆహారపు కొత్త అలవాటులు అనే చెప్పుకోవాలి . అయితే షుగర్ వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కన్నా షుగర్ రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా మంచిది అంటూ కొందరైతే షుగర్ రాకుండా ఉండేందుకు  నోరు కట్టేసుకుంటే సరిపోతుంది అని చెప్తూ ఉంటారు . స్వీట్ పదార్థాలు ఎక్కువగా తినకపోవడం తెల్ల అన్నం కి దూరంగా ఉండటం మరింత ఉత్తమం అని డాక్టర్లు కూడా చెబుతున్నారు . అయితే కొన్ని కొన్ని సార్లు మనం ఎంత ప్రయత్నించినా సరే స్వీట్స్ తినకపోయినా తరచూ వ్యాయామలు చేస్తున్న కూడా షుగర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.  అయితే షుగర్ వచ్చే ముందు మనకి కచ్చితంగా బాడీ హెచ్చరిస్తుంది.  బాడీలో కొన్ని సింటమ్స్ తెలిసిపోతూ ఉంటాయి. మన బాడీలో వచ్చే ప్రధానమైన మూడు మార్పుల కారణంగా మనం మనకు షుగర్ రాబోతుంది అని ఈజీగా గ్రహించవచ్చు దానికి సంబంధించిన విషయాలు ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!


ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంట్ అంటే ఏ రోగం కూడా అప్పటికప్పుడు వచ్చేయదు. కచ్చితంగా ముందు నుంచి మన బాడీలో తిష్ట వేసుకోవడానికి తనకు ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది . అలాంటప్పుడే మనకి ప్రధానంగా కొన్ని సింప్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అలా సింప్టమ్స్ కనిపించినప్పుడు మనకి మనం జాగ్రత్తలు తీసుకుంటే ఆ జబ్బును పూర్తిగా దూరం పెట్టొచ్చు అని చెప్పలేము కానీ కొంతవరకు దూరం పెట్టొచ్చు . మరీ ముఖ్యంగా షుగర్ అనేది సడన్గా ఏమీ రాదు అది వచ్చే ముందు కొన్ని వార్నింగ్ సైన్స్ ఇస్తుంది .

 

మనం ఎక్కువగా గమనించినట్లయితే కొంత మంది మామూలు మీద ఎక్కువగా యూరిన్ కి వెళ్తూ ఉంటారు. అది కూడా షూగర్ వచ్చే ముందు ఓ లక్ష్ణమ్నే.  చాలా మంది ఇప్పుడు నీళ్లు ఎక్కువగా తీసుకుంటున్నారు బాడీ డిహైడ్రేట్ కాకూడదు అంటూ హైడ్రేటెడ్ గా ఉండాలి అంటూ బాటిల్ బాటిల్ నీళ్లు తాగేస్తున్నారు . అయితే కొన్నిసార్లు మనం ఎంత నీళ్లు తాగినా కూడా బాడీ ఇంకా డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది.  ఇది షుగర్ వచ్చేటప్పుడు చాలామందిలో కనిపించే ప్రధానం లక్షణం. అంతేకాదు గంటకు ఒక మూడు సార్లు అయినా సరే యూరిన్ కి వెళ్తూ ఉంటారు . గంటకి మూడుసార్లు .. నాలుగు సార్లు పైన యూరిన్ కి వెళ్తూ ఉంటే ఒకసారి కచ్చితంగా షుగర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.

 

అంతేకాదు ఏదైనా గాయం అయిన తర్వాత వెంటనే మానకపోయినా అది పుండుగా ఏర్పడిపోయినా మీకు షుగర్ వస్తుంది అని చెప్పడానికి ప్రధాన సింప్టమ్స్.  అంతేకాదు మనం రెగ్యులర్ గా తినే ఫుడ్ తింటూ ఉన్న వ్యాయామం చేయకపోయినా సడన్ గా ఉన్నట్టుండి బరువు తగ్గిపోతే కూడా అది ఒక షుగర్ సింప్టమ్స్ చెబుతున్నారు డాక్టర్లు . మరీ ముఖ్యంగా ఎంత తెల్లగా ఉన్న వాళ్ళైనా సరే మెడ చుట్టూరు నలుపుగా తిరుగుతూ ఉంటే నల్లగా మచ్చలు ఏర్పడుతూ వస్తూ ఉంటే అది షుగర్ లక్షణమే అని ఎక్కువగా  లేడీస్ లల్లో ఇది కనిపిస్తాయి అని డాక్టర్లు చెబుతున్నారు . చిన్న పాటి పులిపిర్లు కూడా కనిపిస్తాయి అంటూ డాక్టర్లు చెబుతున్నారు.



నోట్ : ఇది సాధారణ సమాచారం కోసం మాత్రమే . ఇది ఏ విధమైన మెడిసిన్ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు . అది పాఠకులకు గుర్తుంచుకోవాలి. మీరు ఏదైనా పాటించే ముందు ఒకసారి వైద్యుని సంప్రదించడం ఉత్తమం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: