దేశంలో మళ్ళీ కరోనా విజృంభన రోజురోజుకి పెరుగుతూ ఉన్నది. ఇప్పటికే చాలా మంది ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఈ వైరస్ బారిన పడే వారి సంఖ్య కూడా తాజాగా పెరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 6000కు పైగా కేసులు నమోదు అయ్యాయని ఈ విషయం పైన కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఇందులో భాగంగా కోవిడ్ వైరస్ బారిన పడి మరణించిన వారి  సంఖ్యను కూడా తెలియజేశారు. ఇప్పటివరకు మొత్తం 65 మంది మరణించినట్లుగా తెలియజేశారు.


కేరళలో ఇప్పటివరకు అత్యధికంగా 1950 యాక్టివి కేసులు నమోదయ్యాయి. రాష్ట్రాల వారిగా కోవిడ్ కేసుల సంఖ్య విషయానికి వస్తే..

1). కేరళ-1950
2). గుజరాత్ 822
3).వెస్ట్ బెంగాల్ 693
4).ఢిల్లీ 686
5).మహారాష్ట్ర తో 595
6).కర్ణాటక 366
7).ఉత్తరప్రదేశ్ 219
8). రాజస్థాన్ 132
9). తమిళనాడు 194
10). ఆంధ్రప్రదేశ్ 86
11). తెలంగాణ 10


ఇక మిగిలిన ప్రాంతాలలో చాలా తక్కువగానే ఉన్నట్లు తెలియజేశారు వైరస్ బారిన పడని ప్రాంతాల విషయానికి వస్తే అరుణాచల్ ప్రదేశ్, మిజోరం బట్టి ప్రాంతాలలో ఎలాంటి కేసులు నమోదు కాలేదని తెలియజేశారు.


ఇక కరోనా కేసుల సంఖ్య రోజు పెరుగుతూ ఉండడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆందోళన చెందుతూ ఉన్నాయి ప్రస్తుతం కేసులు పెరుగుదల వ్యాప్తిని సైతం అరికట్టడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే వైద్యులు సైతం ఎవరు కూడా భయపడవద్దంటూ తెలియజేస్తున్నారు. 2021 లో కరోనా బీభత్సవం ఎలా సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు ఇప్పుడు మళ్లీ కూడా అలాంటి పరిస్థితులు వస్తున్నట్లు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరి రానున్న 24 గంటల లో కరోనా కేసుల పైన మరింత అప్డేట్ ఇస్తారేమో WHO చూడాలి మరి. ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్లడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: