
అంతేకాదు, బీట్ రూట్ జ్యూస్‌లోని యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా బీటాలైన్‌లు రక్తనాళాలలో కలిగే వాపును తగ్గిస్తాయి. ఇది మొత్తం గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. క్రమం తప్పకుండా బీట్ రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల గుండెకు రక్త సరఫరా మెరుగుపడుతుంది. ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన మహిళల్లో గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
బీట్ రూట్‌లో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ అదుపులో ఉండటం కూడా గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. వ్యాయామం చేసేవారికి ఇది మరింత ఉపయోగపడుతుంది. కాలేయం పనితీరును మెరుగుపరచడం ద్వారా శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపడంలో బీట్ రూట్ సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన జీవక్రియ కూడా గుండెకు మంచిది. బీట్ రూట్ జ్యూస్‌ను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆరోగ్యానికి లాభమే తప్ప ఎలాంటి నష్టం లేదు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు