
అయితే కొంతమంది మాత్రం తెల్ల అన్నం తినకపోతే అస్సలు వాళ్ళకి కడుపు నిండినట్లు ఉండదు . మనకి మొదటి నుంచి తెల్ల అన్నం తినడమే అలవాటు . అలాంటి అన్నం తినకపోతే అసలు భోజనం చేసినట్లు కూడా అనిపించదు . అయితే షుగర్ ఉన్నవాళ్లు తెల్ల అన్నం తిన్నా కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండాలి అంటే ఒక చిన్న టిప్ ఫాలో అయితే సరిపోతుంది అంటున్నారు డాక్టర్లు . మనం అన్నం వండుకునేటప్పుడు బియ్యం కడిగేటప్పుడు చాలా టైం గ్యాప్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగవు తెల్ల అన్నం తిన్నా కూడా అని చెప్తున్నారు .
అన్నం వండుకునే మూడు గంటల ముందే బియ్యాన్ని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడుక్కొని .. ఆ తర్వాత శుభ్రమైన నీటిని పోసి పక్కన పెట్టేసి ..అన్నం వండుకునే ముందు ఆ నీటిని వడిచేసి కొత్త నీరు పోసుకొని అన్నం గెంజి వండుకొని తింటే షుగర్ లెవెల్స్ పెరగవు అని.. ఇలాంటి అన్నం ని షుగర్ పేషెంట్స్ కూడా నిరభ్యంతరంగా రెండు కప్పుల వరకు తినొచ్చు అని డాక్టర్లు సజెస్ట్ చేస్తున్నారు . ఎవరైతే షుగర్ ఉండి షుగర్ పెరిగిపోతుందేమో కాని తెల్ల అన్నం తింటేనే మాకు ఆకలి తీరుతుంది అనుకునే వాళ్ళు ఇలాంటి టిప్ ఫాలో అయితే బాగుంటుంది అంటూ డాక్టర్ సజెస్ట్ చేస్తున్నారు..!!
నోట్ : ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొందరు డాక్టర్లు చెప్పిన విధంగానే ఇవ్వబడినది. ఇది ఎంతవరకు నమ్మాలి ఎంతవరకు పాటించాలి అనేది పూర్తిగా పాఠకుల వ్యక్తిగత అభిప్రాయం. ఏదైనా మీరు సూచనలు సలహాలు పాటించే ముందు మీ డాక్టర్ ని సంప్రదించడం మరింత ఉత్తమం అనే విషయం గుర్తుపెట్టుకోండి..!!