గత కొంత కాలం నుంచి పురావస్తు శాఖ అధికారులు తవ్వకాలను ప్రారంభించి ఎన్నో పురాతన వస్తువులను వెలికి తీస్తున్నారు. ఈ క్రమంలోనే శవపేటిక నుంచి మమ్మీని బయటకు తీయడం, అస్థిపంజరానీకి బంగారు నాలుకను గుర్తించడం వంటివి తవ్వకాలలో బయట పడినట్లు పురావస్తుశాఖ అధికారులు తెలియజేశారు. అయితే తాజాగా ఈజిప్టులో తవ్వకాలు చేపట్టిన పురావస్తుశాఖ అధికారులు తాజాగా పురాతనమైన బీర్ ఫ్యాక్టరీ గుర్తించారు.                                                      

కైరో నగరానికి దక్షిణవైపున 450కి.మీ దూరంలో, నైల్‌ నదికి పశ్చిమాన ఉన్న ఏడారిలో అబిడోస్‌ అనే శ్మాశన ప్రాంతంలో ఈ బీర్‌ ఫ్యాక్టరీ బయటపడినట్లు పురావస్తు శాఖ అధికారులు తెలియజేశారు. ఈ బీర్ ఫ్యాక్టరీలో ఎనిమిది యూనిట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో యూనిట్ 20 మీటర్ల పొడవు..2.5 మీటర్ల వెడల్పు ఉన్నాయి. అదేవిధంగా ఒక్కో యూనిట్ లో దాదాపు 40 కుండలు ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.

యూనిట్ లో ఉన్న కుండలలో బీర్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలన్నింటినీ వేసి బాగా వేడి చేస్తూ బీరు ను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పూర్వకాలంలో బీర్లు ఈ విధంగానే తయారు చేయబడే వని ఈ సందర్భంగా పురావస్తు శాఖ అధికారులు తెలిపారు.ఈ బీర్ ఫ్యాక్టరీ కింగ్‌ నార్మన్‌ అనే చక్రవర్తి హయాంలో నిర్మాణం జరిగినట్లు అధికారులు గుర్తించారు. క్రీస్తుపూర్వం 3,150 - 2,613 మధ్య తొలి ఐక్య ఈజిప్టు రాజ్యాన్ని పరిపాలించిన రాజుగా కింగ్‌ నార్మన్‌కు మంచి గుర్తింపు ఉండేదని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు.అయితే ఈ బీరు ఫ్యాక్టరీలో మరింత లోతుగా అధ్యయనం చేసి మరికొన్ని ఆనవాళ్లను గుర్తించడానికి అధికారులు ప్రయత్నాలు జరుపుతున్నట్లు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: