గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో ఏప్రిల్ 18వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం


ముఖ్య సంఘటనలు..

1930 : భారత స్వాతంత్ర్యోద్యమము: 1930 ఏప్రిల్ 18 తారీకున సూర్య సేన్ ఇతర విప్లవకారులతో కలిసి మందుగుండు, ఆయుధాలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ సమాచార వ్వవస్థను విచ్ఛిన్నం చేసి ప్రాంతీయ ప్రభుత్వాన్ని ఏర్పరుచుటకై చిట్టగాంగ్ లోని ఆయుధాగారాన్ని ముట్టడించారు.
1923: అల్లూరి సీతారామరాజు నేతృత్వంలో అన్నవరం పోలీస్ స్టేషన్‌పై దాడి జరిగింది.

ప్ర‌ముఖుల జననాలు

1774: సవాయ్ మాధవ రావ్ II నారాయణ్ మరాఠా సామ్రాజ్యంలో 14వ పేష్వా (మ.1795).
1809: అధ్యాపకుడు, పండితుడు, కవి హెన్రీ డెరోజియో జననం (మ.1831).
1880: టేకుమళ్ళ అచ్యుతరావు, విమర్శకులు, పండితులు. (మ.1947)
1938: అత్తిలి కృష్ణారావు, వీధి నాటక రచయిత. (మ.1998)
1958: మాల్కం మార్షల్, వెస్టీండీస్ క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ ఆడిన అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా పేరుపొందినాడు. మరికొందరి ప్రకారం అతడే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడు. మార్షల్ టెస్ట్ క్రికెట్‌లో 20.94 సగటుతో 200 పైగా వికెట్లు సాధించాడు. ఈ గణాంకాలే అతడిని అత్యుత్తమ బౌలర్‌గా నిలబెట్టినాయి. అతడి సమకాలీన బౌలర్లతో పోలిస్తే ఇతడు పొట్టివాడు. 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉండే ఇతడు ఆరున్నర అడుగుల ఎత్తు ఉండే జోయెల్ గార్నర్, కర్ట్‌లీ ఆంబ్రోస్, కోర్ట్‌నీ వాల్ష్, కొలిన్ క్రాప్ట్ లతో పోలిస్తే ఎత్తుతక్కువే. సాధారణంగా 8 వ స్థానంలో బ్యాటింగ్ చేసే మార్షల్ దిగువ ఆర్డర్‌లో ప్రత్యర్థులను ఆటపట్టించేవాడు. ఆ స్థానంలో ఆడి కూడా టెస్టులలో 10 అర్థ శతకాలు సాధించడం విశేషం. అతడి అత్యధిక టెస్ట్ మ్యాచ్ స్కోరు భారత్‌పై సాధించిన 92 పరుగులు. టెస్టులలో 376 వికెట్లు, వన్డేలలో 157 వికెట్లు సాధించాడు.
2012: కందిక వర్షిత్, నెక్కొండ(గ్రామం&మండలం), వరంగల్ రూరల్, తెలంగాణ.

ప్ర‌ముఖుల మరణాలు..

1859: తాంతియా తోపే, భారత స్వాతంత్ర్యోద్యమకారుడు. (జ. 1814)
1955: ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, శాస్త్రవేత్త. (జ. 1879)
1974: గడిలింగన్న గౌడ్, కర్నూలు నియోజకవర్గపు భారతదేశ పార్లమెంటు సభ్యుడు. (జ. 1908)
2015: శ్రీ, సంగీత దర్శకుడు, గాయకుడు. (జ. 1966)
2016: దండి భాస్కర్ సీ పి ఐ రాష్ట్ర కార్యదర్శి, వార్తా దినపత్రిక జర్నలిస్ట్.


పండుగలు , జాతీయ దినాలు

ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం
అంతర్జాతీయ చారిత్రిక కట్టడాల దినోత్సవం (ప్రపంచ వారసత్వ దినోత్సవం)

మరింత సమాచారం తెలుసుకోండి: