చాలామంది పర్యాటకులకు  ఈ ప్రదేశం గురించి తెలియకపోయినా, ప్రచారం లేకపోయినా ఆశ్చర్యపోయే  అంతా ఆ ప్రకృతి సౌందర్యం ఆ ప్రదేశానికి సొంతం చెప్పవచ్చు. చుట్టూ దట్టమైన అడవి పచ్చని కొండలు వాటి మీద నుంచి దూకే జలపాతం ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇక ప్రకృతి  సౌందర్యం నడుమ ఆధ్యాత్మిక వాతావరణం చారిత్రక ఘట్టాలు ఇవన్నీ సమూలంగా కనబడుతూ కనువిందు చేస్తాయి. మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిచ్చే ఆ పవిత్ర స్థలమే భీముని పాదం జలపాతం. ఈ జలపాతం ఎక్కడ ఉందో తెలుసుకుందాం..

 మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని  ఒక మారుమూల చిన్న గ్రామం అదే సీతానగరం. ఆ గ్రామంలోనే 70 అడుగుల ఎత్తు నుంచి దూకే అటువంటి ఆ జలపాతం ఉన్నది. దీని చూడాలంటే  మన రెండు కళ్ళు సరిపోవు. జలపాతం పక్కనే ఒక పెద్ద గుహ కూడా ఉందని, మనం కాసేపు అక్కడ గడిపితే  మనస్సు ఎంతో పులకరిస్తుంది అంటున్నారు పర్యాటకులు. ప్రకృతి ప్రేమికులు అందుకే ఏ కాస్త సమయం దొరికినా చుట్టుపక్కల ఉన్న వారంతా అక్కడికి వెళ్లి సేదతీరుతూ ఉంటారు. వర్షాకాలం వస్తే చాలు కనులవిందుగా ఈ జలపాతం అక్కడికి వచ్చిన పర్యాటకులకు ఆనందాన్ని కలిగిస్తుందని వారంటున్నారు. ఉదయాన్నే సూర్యకిరణాల జలపాతం మీద పడ్డప్పుడు అందాన్ని చూడాలంటే మనకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ దృశ్యాన్ని వీక్షించాలంటే ఆ రెండు కళ్లు కూడా సరిపోవు.


సహజసిద్ధంగా ఏర్పడిన భీముని పాదం జలపాతం అలరిస్తూ, పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ జలపాతానికి నీరు ఎక్కడి నుంచి వస్తుందో  అది అంతుపట్టని రహస్యం. 70 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం పర్యాటకులను మైమరపిస్తు, దీని పక్కనే గుహ ఉండడం విశేషం. రాష్ట్రంలో అత్యంత ప్రాచుర్యం కలిగిన ఈ భీముని పాదం జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని 2014 ఎన్నికల సందర్భంగా నేతలు చెప్పారని కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదని అక్కడి ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా నాయకులు స్పందించి ఈ భీముని జలపాతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: