ప్రముఖ గణిత శాస్త్రవేత్త ఆర్కిమెడిస్ మీకు తెలుసు కదా... ఏదైనా పరిశోధనల గురించి ఆలోచిస్తుంటే ఆయన సర్వం మర్చిపోతాడు. ఒక్కసారి తను స్నానం చేస్తున్న విషయం కూడా మరిచిపోయి యురేకా .. అంటూ వీధుల్లోకి పరిగెత్తాడు. అంతటి గొప్ప ఏకాగ్రతా పరుడు. అయితే, అదే ఆయన పాలిట శాపంగా మారింది. ఒకసారి రోమన్లు సిరాక్యుస్ రాజధానిని ముట్టడించారు. అప్పుడు ఆ దేశ రాజు ఆర్కిమెడిస్ సిద్ధాంతాల ఆధారంగా తయారు చేసిన యంత్రాల సహాయంతో శత్రువులను జయించాడు. అయితే, కొద్ది రోజుల తర్వాత రోమన్లు తిరిగి దాడి చేశారు. అప్పుడు ఆర్కిమెడిస్ ను తీసుకురమ్మని రాజు ఒక సైనికుడిని వాళ్ల ఇంటికి పంపాడు. పరిశోధనల గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్న ఆర్కిమెడిస్ ఆ సైనికుడిని మందలించాడు. దాంతో, ఆగ్రహించిన ఆ సైనికుడు వెంటనే ఆర్కిమెడిస్ శిరస్సును ఖండించాడు. అందుకే, ఏదయినా మితిమీరి చేయకూడదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: