చాలామంది తల్లులు కాఫీని తాగడానికి ఇష్టపడతారు. ఇది చాల రుచికరమైనది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలకి ఉత్తమమైనది, పోషకమైనది ఇవ్వాలని కోరుకుంటారు. వారి ఆరోగ్య విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వారి ఆహార విషయంలో.. మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని వారికీ ఇవ్వాలని కోరుకుంటారు. కానీ మీరు టీనేజర్, లేదా మినీ-అడల్ట్ కు పేరెంటింగ్ చేస్తుంటే, అది ఎంత కష్టమో మీకు తెలుస్తుంది. ఎందుకంటే వారు చిన్నపిల్లలా మాట వినరు. వారు అధికంగా జంక్ ఫుడ్ ను ఎక్కువ ఇష్టపడతారు.

అయితే పిల్లలకి కాఫీ చెడ్డదని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఎక్కువ శాతం మంది టీనేజర్లు కాఫీని అధికంగా ఇష్టపడతారు. అయితే మీరు పిల్లల నుండి దూరంగా ఉంచాలి. కానీ, మీ పిల్లలకు వారి మొదటి కప్పు కాఫీ తాగటానికి నిజంగా సరైన సమయం ఏమిటని మీరు ఆశ్చర్యపోతున్నారా.. టీనేజర్‌ కు క్రమం తప్పకుండా కాఫీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయా. కాఫీ పిల్లలకి హానీకరమని అనేక మంది తల్లిదండ్రులు భావిస్తారు. కాఫీ వారి వృద్ధిని దెబ్బతీస్తుందని భావిస్తారు. అయితే ఇది నిజం కాదు. కాఫీ మీ పిల్లల పెరుగుదలను ప్రభావితం చేయదు లేదా అడ్డుకోదు.

పిల్లలకు, పెద్దలకు కాఫీ వల్ల ప్రమాదాలు ఒకే విధంగా ఉంటాయి . కెఫిన్ శరీరానికి బలమైన ఉద్దీపన ఇది మెదడు, శరీరాన్ని చురుకుగా ఉంచడానికి సహాయపడుతుంది. సాధారణ అనుమతించదగిన మొత్తం వల్ల పెద్దగా ప్రమాదం లేదు, కానీ కెఫిన్ మొత్తం పరిమితులను మించి ఉంటే, అది మీ శరీరానికి ఆరోగ్యానికి హానీ కలిగిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే, మీ పిల్లల పోషణకు సంబంధించినంతవరకు రోజుకు ఒక కప్పు కాఫీ తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం కలగదు. 12 ఏళ్లు పైబడిన పిల్లలు రోజూ ఒక కప్పు కాఫీ తీసుకోవచ్చు, అయితే వారు ఇతర ఆహార పదార్దాలు లేదా పానీయాల నుండి అదనపు కెఫిన్ తీసుకోకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: