బాల్యంలో చిన్న పిల్లలు చిలిపి పనులు చేస్తూ అల్లరి అల్లరిగా గడిపేస్తుంటారు. ఇక అమాయకపు ఆలోచనలతో గడిపిన బాల్యాన్ని దాటుకొని.. కౌమారం అనే కొత్త ప్రంచంలోకి అడుగు పెట్టి కాలం ఇంతా తొందరగా గడిచిపోయిందా అని తెలియకుండానే యవ్వనం ముగిసిపోతుంది. అప్పటి వరకు చూట్టూ ఉన్న సమాజం ఏం మాట్లాడుకుంటుందో మనం పట్టించుకోం. కొత్త సందేహాలెన్నో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఎన్నెన్నో ఒత్తిళ్లు మరెన్నో సవాళ్ళు. ఇనాళ్ళు చూసిన ప్రపంచం వేరు ఇప్పుడు చూస్తున్న ప్రపంచం  వేరు అన్నట్లుగా కనిపిస్తుంది. యవ్వనం ఉవ్వెత్తు తరంగాలుగా మనసును అల్లకల్లోలపరుస్తుంటుంది.  

ఇక యువత మానసిక ఆరోగ్యం మీద ప్రత్యేకంగా దృష్టి సారించాలి. ఇందుకు పెద్దల సహాకారం ఉండాలి. మనిషి జీవితంలో కీలమైంది, కష్టతరమైంది, అత్యంత ప్రధానమైనది యుక్తవయస్సు. భవిష్యత్తుకు పునాది పడేది ఈ దశలోనే. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో మార్పులు సంభవించే సమయం. అప్పటివరకు ఇంటిపట్టునే ఉన్నవారు అప్పుడే తమకు స్వేచ్ఛ వచ్చినట్లు భావిస్తూ ఉంటారు. ప్రతీ దానికి అట్రాక్ట్ అవుతారు. ఎక్కడెక్కడో స్కూళ్లోలోనో, కాలేజీల్లోనో అడుడుపెడుతారు.

అయితే కొత్త వాతావరణం, కొత్త వ్యక్తులు, కొత్త పరిచయాలు, కొత్త చదువులు.. మరోపక్క  ఆన్‌లైన్‌ సోషల్ మీడియా వేదికలు. ముందు అంతా బాగానే ఉన్న తర్వాత సమస్యలు మెుదలవుతాయి. తోటివాళ్లతో పోల్చుకుంటూ వారిలా ఉండలేకపోతున్నామనో..అలా చదువుకో లేకపోతున్నామనో..వాళ్ళకు ఉన్నవి మనకు లేవనో కలవరం నిలవెల్ల పాకిపోతుంది. అప్పడే భయాలు, ఆందోళనలు వంటివి దాడిచేసే ప్రమాదముంది.  

ముందుగానే పిల్లల పరిస్థితిని గుర్తించి వారిలో పెద్దలు జాగ్రత్త పడటం మంచిది. వారిలో సమస్యలు వచ్చాక జాగ్రత్త పడేకంటే నివారించుకోవటమే ఉత్తమం. పిల్లలు చదువు కోసం మరో ప్రాంతానికి వెళ్ళే ముందు వారికి జాగ్రత్తలు చెప్పాలి. అక్కడ ఎలా ఉండాలి? సమస్యలు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలి? అనేవి విడమరుస్తూ ముందే సన్నద్ధం చేయాలి. చెడు అలవాట్ల వైపు మళ్లకుండా సూచనలు ఇవ్వాలి. కాల్పనిక ప్రపంచం కన్నా వాస్తవిక జీవన సంబంధాలు, ఆత్మీయ అనుబంధాలు ముఖ్యమనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా పిల్లలకు వివరించాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: