
ఇక ఫ్రిజ్ నీరుకు బదులుగా ప్లెయిన్ ఫిల్టర్ వాటర్ ను వారికీ ఇవ్వాలి. నీటి లో ఎటువంటి క్యాలరీలు, ఎటువంటి హాని కారక రసాయ నాలు ఉండ వు. అలాగే, ఎవ్వరు పాలు తక్కువగా తాగుతా రో వారిలో లాక్టోజెన్ లోపం వస్తుంది. పాలు తాగడానికి ఇష్ట పడని పిల్లలకు సోయా మిల్క్‌తగ్గించే ప్రయత్నం చేయాలి. అయితే సోయలో ఖనిజాలు, ప్రొటీన్లు అధిక మోతాదులోఉండడం వలన పిల్లల శారీరక ఎదుగు దల వేగంగా వృద్ధి చెందుతుంది.
అయితే మరి కొందరు పిల్లలు బాదంపప్పు, జీడిపప్పు వంటి గింజలను తినడానికి ఇష్టపడరు. ఇలాంటి వారికి ప్రొటీన్లు, న్యూట్రిన్లు అధికం గా ఉండే బాదం పాలు ప్రయోజనకరం గా ఉంటాయి. దీనితో తక్కువ కొవ్వులు కలిగిన పీచుపదార్థం కూడా అందుతుంది. యాంటీఆక్సిడెంట్స్, పొటాషియం, ఎలక్టో ల్రైట్స్ పిల్లల ఆరోగ్యానికి అవసరం. వీటిలో చక్కెర పాళ్లు తక్కువ గా ఉంటాయి. శరీరం లో నీటి శాతం తగ్గిపోతే చర్మ, ఉదర సమస్యలువస్తాయి.
అంతేకాక.. పిల్లల ఆరోగ్యానికి పుచ్చకాయ, బత్తాయి, ఆపిల్ మామిడి, జ్యూస్‌లు ఎంతో మంచివి. వీటితో పాటు ఎండా కాలంలో పిల్లల దాహాన్ని తీర్చడానికి నిమ్మ రసం ఇవ్వడం మాత్రం మరువద్దు. పిల్లలు ఒక్కొక్కసారి ఏది పడితే అది తినేస్తుంటారు. అలాంటప్పుడు పిల్లలకు కడుపులో గడబిడ మొదలవుతుంది. అలాంటి సమస్యలు తగ్గాలంటే పల్చటి మజ్జిగ ని తాగిస్తుండాలి. అలా చేయడం వలన కడుపులో ఎసిడిటీ తగ్గి జీర్ణ ప్రక్రియ సాఫీగా సాగుతుంది. మధ్య మధ్యలో లస్సీ కూడా ఇస్తుండవచ్చు. ఇందులో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి.