పుట్టినప్పుడు పిల్లలు చాలా అందగా కనిపిస్తూ ఉంటారు. అయితే పెద్దగా అవుతుంటే పిల్లలు చిన్నపుడు ఉన్నంతగా క్యూట్ గా కనిపించారు. చర్మం రంగులో కొన్ని రకాల పద్ధతులు ఫాలో అయిన కూడా పిల్లల రంగులో మార్పు ఉండకపోవచ్చు. అయితే పిల్లలు పెరిగెకొద్దీ ఆనందంగా కనిపించాలంటే గర్భిణులు ఇవి పాటించాల్సిందే. అయితే బిడ్డకు తల్లి పాలు తప్పనిసరిగా ఆరు నెలల పాటు అవసరం. తల్లి పాలు 6 నెలల పాటు క్రమం తప్పకుండా బిడ్డకు ఇవ్వడం వలన ఆరోగ్యంగా, బలంగా తల్లి మరియు బిడ్డ ఉండటానికి ఉపయోగపడుతుంది. అలాగే పిల్లల చర్మం రంగులో ప్రకాశవంతమైన మార్పు కనిపిస్తుంది.

ఇక పసి పిల్లలకు ఆరు నెలలు లేదా ఎనిమిది నెలల తర్వాత సాలిడ్ ఫుడ్ పెట్టడం మొదలుపెడుతూ ఉంటారు. ఆరు నెలల తర్వాత పిల్లలకు ఆపిల్, క్యారట్, బీట్ రూట్ వంటి పోషక విలువలు వృద్ధిగా కలిగినటువంటి ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ ను శుభ్రంగా ఉన్న నీటితో కడిగి ఉడికించాలి. ఈ ఆహారం మెత్తగా, జారుడుగా ఉండటం వలన గొంతులో ఆహారం ఇరుక్కుపోదు, త్వరగా జీర్ణం అవుతుంది. ఈ ఆహారం మీ పిల్లల రంగు మార్చడానికి బాగా ఉపయోగపడుతుంది.

అంతేకాదు.. మీరు గర్భంతో ఉన్నప్పుడు నెయ్యి, బాదం, ఆరంజ్, ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు కుంకుమపువ్వు తీసుకోవడం వలన కడుపులోని బిడ్డ అందం పెరగడానికి ఉపయోగపడతాయి. అలాగే మీకు వికారం కలగకుండా ప్రతి రోజూ కొద్దిగా సోంపు (జీలకర్ర) తీసుకోవడం వలన ప్రగ్నన్సీ సమయంలో ఆరోగ్యంగా ఉండటానికి తోడ్పడుతుంది.

అలాగే.. పిల్లల రంగు మారట్లేదు, చర్మం ప్రకాశవంతంగా లేదు అని బాధపడుతున్న తల్లులకు ఉత్తమ చిట్కా సున్నిపిండి. చిన్నతనంలో పిల్లలకు స్నానం చేయించేముందు నువ్వుల నూనె లేదా కొబ్బరినూనెతో శరీరానికి మసాజ్ చేసి ఆ తరవాత సున్నిపిండితో కాస్త పాలు లేదా నీటిని కలిపి పిల్లల శరీరంపై సుతిమెత్తగా రాసి స్నానం చేయించడం వలన పిల్లలు అందంగా ఉంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి: