సమాజంలో తల్లిదండ్రులు ఎల్లప్పుడూ తమ పిల్లలు ఉన్నతమైన జీవితాన్ని అందించడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారికీ ఎలాంటి సమస్యలు రాకుండా ఉండటానికి, ఏదైనా సమస్య వచ్చిన దైర్యంగా ఎదుర్కోని సమాజంలో నిలవడానికి అన్ని రకాలుగా మంచి చెడులను చెబుతుంటారు. అంతేకాదు.. పిల్లల కెరీర్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే పిల్లలు సక్సెస్ ఫుల్ జీవితాన్ని అందుకోవాలంటే వారికీ కొన్ని నియమాలు పాటించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అయితే తల్లిదండ్రులు పిల్లలకు కొత్త భాషలపై పట్టుసాధించేలా కృషి చేయాలి. అయితే వారు కొత్త భాష నేర్చుకోవడం వల్ల వారి జీవితంలో విజయం సాధించడానికి ఏ భాషలు సహాయపడతాయని అంటున్నారు. అంతేకాక.. కొన్ని అధ్యయనాల ప్రకారం ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచే 3 భాషలు ఏంటో ఒక్కసారి చూద్దామా.

తాజాగా యూనైటెడ్‌ కింగ్‌డంలోని హిత్రూ విమానాశ్రయంలో ఉన్న సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ బిజినెస్‌ రీసెర్చ్‌ అండ్‌ ఒపీనియన్‌ నిర్వహించిన సర్వేలో ఫ్రెంచ్, జర్మన్‌ లేదా మాండరిన్‌ నేర్చుకోవడం మంచిదని పేర్కొన్నారు. ఎందుకంటే.. రాబోయే 10 ఏళ్లలో పిల్లల కెరీర్‌ విజయవంతంగా ఉపాధి అవకాశాలు పొందడానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు. .

అయితే ఈ అధ్యయనం ప్రకారం ఒక మాతృభాష కాకుండా ఇతర భాషలో పట్టు ఉండటం వల్ల వారికి అనేక వ్యాపార అవకాశాలకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. అంతేకాదు.. కొత్త వృత్తిపరమైన భాగస్వాములను ఏర్పరుకోవడంలో వారికి దోహదపడుతుందని అన్నారు. కాగా.. ఈ అధ్యయనంలో విద్యాపరమైన అభ్యాసం, సామాజిక నైపుణ్యాలు, అభివృద్ధిని తెలియజేస్తాయని అన్నారు. అందుకే మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని మీరు కోరుకుంటే.. మాతృభాషతో పాటు విదేశీ భాషను కూడా నేర్పించాలని అన్నారు.

ఇక అదనంగా అనేక దేశాల సాధారణ భాష అయిన ఆంగ్లం తప్పకుండా బోధిస్తే వారి జీవన ప్రమాణాలు బాగా పెరుగుతాయని పేర్కొన్నారు. కాగా.. పిల్లల కోసం కొత్త భాష నేర్చుకోవడం వల్ల వారి ఉద్యోగం, భవిష్యత్తులో మంచి జీతం లభిస్తుందని అన్నారు. అలాగే అదనపు భాషానైపుణ్యాలు పిల్లల అభివృద్ధి, భవిష్యత్తులో గొప్ప పెట్టుబడి అని నిపుణులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: