వేరుశెనగగుళ్ళు వీటిని పల్లీలు అనికూడా పిలుస్తారు,ఇంగ్లీష్ లో వీటిని పీనట్స్ మరియు గ్రౌండ్ నట్స్ అని పిలుస్తారు.ఈ పల్లీ చట్నీ లేకుండా కొంతమందికి బ్రేక్ఫాస్ట్ అవ్వదు,ఇడ్లీ,దోస, వడ,పూరి,,ఉప్మా,ఏదైనా సరే పల్లీ చట్నీ ఉంటే ఆ రుచే వేరు. అయితే వీటిని తినటమే కాదు వీటి గురించి తెలుసుకుందాం రండి,వీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.కొంతమంది నిపుణులు రోజు వీటిని ఏదోఒక రూపంలో తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని చెప్తున్నారు.ఇందులో ఉన్న క్రొవ్వు మనకి గుండెకి మంచిది అని చెప్తున్నారు.ఇందులో ప్రోటీన్లు పుష్కళంగా ఉన్నాయి.మన శరీరంలో కణాల ఉత్పతిలో కొత్త కణాల తయారీలో ఇది మనకు చాలా సహాయపడుతుంది.ఫ్రీరాడికల్స్ రాకుండా రక్షిస్తుంది.రోజూ డ్రై ప్రూట్స్ తో వీటిని కూడా కలిపి తీసుకోవడం వల్ల, మంచి ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.వీటిని నానబెట్టి రోజు తినడం వల్ల శరీరానికి శక్తీ సమాకూరుతుంది.


బాదం, జీడిపప్పు,పిస్తా,వాల్ నట్స్ తో పాటు ఈ పీనట్స్ కూడా కలిపి తీసుకుంటే రోజంతా హుషారుగా చురుగ్గా ఉంటారు.వీటిని నైట్ అంతా నానబెట్టి ఉదయాన్నే ఒక అరటిపండు జోడించి జ్యూస్ లా చేసుకొని తాగితే శరీరంలో రక్తశాతం పెరుగుతుంది.స్కిన్ ఎలర్జీలు ఉన్నవారు డైలీ ఇలా తీసుకోవడం వల్ల ఈ సమస్యనుండి బయటపడతారు. రక్తశాతం పెంచడమే కాకుండా రక్తాని శుద్ది చేస్తుంది.వీటి  పుష్కళంగా  వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి.కండరాల నొప్పులు ఉంటే వెంటనే తగ్గుతాయి.శరీరాన్ని మెదడును చురుగ్గా ఉంచి పనిచేస్తుంది.అలసట దరి చేరదు.రోజూ ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఆకలిని తగ్గిస్తుంది.అధిక బరువుతో బాధ పడేవారు ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల వారికి త్వరగా ఆకలి వేయదు.దీని వల్ల బరువు త్వరగా తగ్గవచ్చు.ఈ వేరుశనగ పప్పు తినడం వల్ల క్యాన్సర్, గుండెజబ్బులు,నరాల బలహీనతలు రాకుండా ముందుగానే చూసుకుంటుంది.ఎదిగే పిల్లలు మంచి తెలివితేటలతో చురుగ్గా పెరుగుతారు.ప్రతిరోజు పిల్లలకి ఈ పీనట్స్ ని బ్రేక్ ఫాస్ట్ లో కానీ జ్యూస్ లో కానీ ఇవ్వడం మర్చిపోవద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: