ఉరుకుల పరుగుల జీవితంలో అంతా ఒత్తిడిమయమే.. కనిపించడని ఈ ఒత్తిడి అనేక రోగాలకు కారణమవుతుంది. అందుకే దీన్ని తగ్గించుకోవడం చాలా అవసరం. దీనికి ఈ చిట్కాలు పాటిస్తే రిలాక్సవుతారు. అందుకు ఏం చేయాలో చూద్దామా..

 

ఒత్తిడి తగ్గాలంటే.. క్రాస్‌వర్డ్‌ పజిల్స్‌, పదవినోదం వంటివి పూరించండి. కాసేపు వాటిని ప్రయత్నించండి. మనసుకు ఊరటగా ఉంటుంది. మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలు గుర్తుకు రాకుండా ఉంటాయి. గోరువెచ్చని నీళ్లల్లో రెండు చుక్కల లావెండర్‌ నూనె కలపండి. ఇది ఒళ్లునొప్పులు, ఒత్తిడి లేకుండా చేస్తుంది.

 

ఒత్తిడి తగ్గాలంటే.. కాసేపు చిన్నపిల్లలైపోయి వారితో కలిసి పచ్చటి గడ్డిలో ఆటలాడండి. చెప్పులు లేకుండా నడిస్తే గడ్డి నరాలకి తగిన మర్దన అందిస్తుంది. దాంతో ఒత్తిడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. పిల్లలు బొమ్మల్లో రంగులు నింపుతూ ఎంత ఆనందంగా ఉంటారు. మీరూ ఒత్తిడిగా ఉన్నప్పుడు అదే చేయండి. ఆ వర్ణాలు మీ మనసుని కాసేపు పక్కకి మళ్లించి ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: