అందంగా కనిపించాలని ఎవరికి ఉండదు చెప్పండి. అమ్మాయిలు, అబ్బాయిలు టీనేజ్‌లో ఉన్నప్పుడు అందంగా కనిపించడానికి ఎన్నో రకాల టిప్స్‌ని ఫాలో అవుతుంటారు. ఇక వయస్సు పెరగడం అనేది ఒక సహజ ప్రక్రియ అని మనందరికీ తెలిసిందే. దీని వ‌ల్ల మ‌నం అందాన్ని కోల్పోతూ ఉంటాం. ఇక‌ వ‌య‌స్సు మనం నియంత్రించలేము, కానీ నెమ్మదింపచేయగలము. అయితే ముఖం అందంగా కనిపించేందుకుగాను ముక్కుకు చేయించుకునే శస్త్రచికిత్స(రైనోప్లాస్టీ)లతో మహిళల వయసు తగ్గుతుందని చెప్తున్నారు అమెరికా పరిశోధకులు.

 

అదేంటి.. ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకుంటే వ‌య‌స్సు ఎలా త‌గ్గుతుంది అనుకుంటున్నారా..? నిజంగా వ‌య‌స్సు త‌గ్గ‌దండోయ్‌..  వాస్తవ వయసుతో పోలిస్తే మూడేళ్లు తక్కువ వయసున్నట్లు కనిపిస్తారట. సాధార‌ణంగా ముక్కు సరిగా లేకపోతే ఎంత అందంగా ఉన్నా..ముఖం అసౌకర్యంగా కనిపిస్తుంది. ముక్కుకు సర్జరీ చేసుకోవడం ద్వారా ముఖం అందంగా కనిపించడమే కాకుండా మరో ఉపయోగం కూడా ఉందట. అదేనండీ.. మూడేళ్ల యవ్వనంతో కనిపిస్తారట.

 

తాజా అధ్యయనంలో భాగంగా పరిశోధకులు 16-72 ఏళ్ల మధ్య వయసున్న 100 మంది మహిళలను  పరీక్షించారు. రైనోప్లాస్టీ చేయించుకోవడానికి ముందు, శస్త్రచికిత్స జరిగిన 12 వారాల తర్వాత మహిళలు తీసుకున్న ఫొటోలను ప్రత్యేక కృత్రిమ మేధస్సు(ఏఐ) సహాయంతో ప‌రిశీలించ‌గా ఈ విషయం వెల్లడైనట్లు ప‌రిశోధ‌కులు తేల్చారు.  అంటే రైనోప్లాస్టీ తర్వాత వారి వయసును ఏఐ సగటున మూడేళ్లు తక్కువగా చూపించింది. దీంతో ముఖ సౌందర్యంలో భాగంగా చేయించుకునే రైనోప్లాసీ సర్జరీ అత్యంత ప్రాచుర్యం పొందింది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: