ఇక మన శరీరంలో మొత్తం 26 పెద్ద ఎముకలు ఉంటే వాటిలో ప్రధానమైనది కాలి మడమ ఎముక. దీనికి ప్రధానంగా వంద కండరాలు ఇంకా అలాగే 33 చిన్నా పెద్దా ఎముకలు కలిసి మనల్ని నడిపిస్తూ ఉంటాయి.ఇక వీటన్నింటిని కూడా లింక్ చేసేది మడమ కండరమే. ఒక్కోసారి మడమ భాగంలో చిన్న ఎముక లాంటిది పెరిగి అది మడమ ఎముకకు ఇంకా అలాగే కండరానికి మధ్య దూరం పెంచుతుంది. దీని వల్ల కూడా మడమ నొప్పి వస్తుంది. అయితే చాలా అరుదుగా కొంత మందిలో  ఇది కనిపిస్తుంది. ఎక్కువ వాకింగ్, జాగింగ్ వంటివి చేయడం ఇంకా అలాగే అధిక బరువులు ఎత్తడం వంటివి చేయడం వల్ల మడమ నొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్య బారిన పడిన వారు నడవడానికి ఎంతగానో కష్టపడాల్సి వస్తుంది. మడమ కాలి నొప్పికి గుర్తించలేని లక్షణాలు అంటూ ఏవి వుండవు. పాదాల మీద కనుక ఒత్తిడి పడితే మడుమ నొప్పి చాలా విపరీతంగా బాధిస్తుంది.


మెట్టు ఎక్కి దిగేటప్పుడు కూడా ఆ నొప్పి బాగా తెలుస్తుంది.మడమ వెనుక భాగంలో నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. కొందరిలో అరికాళ్ల మంటలు, తిమిర్లు రావడం ఇంకా స్పర్శ తెలియక పోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ సమస్య బారిన పడిన వారు అసలు ఎక్కువగా బరువులు ఎత్తకూడదు. కొన్ని రకాల వ్యాయామాలు చేయడం, వేడి నీటిలో పాదాలను ఉంచడం  ఇంకా అలాగే పాదాలకు మర్దనా చేయడం వంటివి చేయడం వల్ల కొంతమేర నొప్పి నుండి ఉపశమనం అనేది కలుగుతుంది. ఇంకా అలాగే మనం ధరించే చెప్పులు మెత్తగా అలాగే మృదువుగా ఉండేలా కూడా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు పాటించిన తరువాత కూడా మీ కాలికి నొప్పి తగ్గకపోతే మీరు వైద్యున్ని సంప్రదించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: