
ఆయిలీ స్కిన్ టిప్స్ :
ఆయిల్ స్కిన్ కలిగిన వారు ఒక స్పూన్ నిమ్మరసంలో కొంచెం బాదం ఆయిల్ కలుపుకొని ఈ రెండింటి మిశ్రమాన్ని చక్కగా కలుపుకొని మొహానికి మంచిగా మర్దన చేయాలి. అలానే ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు ఉంచాలి. ఒక స్టీమర్ లేదా పాత్ర తీసుకుని అందులోకి కొన్ని నీళ్లు, పసుపు కలుపుకొని నీటిని మరిగించాలి. ఆ నీటి నుండి వచ్చిన ఆవిరిని ముఖానికి పట్టుకోవాలి. ఇలా చేయడం వలన ముఖానికి జిడ్డు కారడం తగ్గుతుంది.
ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు మీ ముఖాన్ని రోజుకు రెండు నుండి మూడుసార్లు కడుక్కోవడం మంచిది. దీనివల్ల చర్మంపై ఉండే దుమ్ము, ధూళి, జిడ్డు వంటివి తొలిగిపోతాయి.దీంతో మొటిమలు వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
ఆయిల్ స్కిన్ ఉన్నవారు రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్ల నీరుని తీసుకోవాలి. ఫ్రూట్ మరియు వెజిటబుల్ జ్యూస్ తీసుకోవాలి.
ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్లు వారానికి రెండుసార్లు మీ స్కిన్ ఎక్స్పోలియేట్ చేయండి.. ఎక్స్పోలియేట్ చేయడం వల్ల పింపుల్స్ వైట్ హెడ్స్,బ్లాక్ హెడ్స్ వంటివి రావు.
ఆల్కహాల్ లేని టోనర్ ని ఉపయోగించండి.పంట పొలాల్లో ఒక అడుగు లోపల బాగాన ఉండే మంచి మట్టిని తీసుకుని అందులో నీరును కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. ఇలా చేయడం వలన మీకు మంచి ఫలితాలు వస్తాయి.