యువకుల్లో తమకేదో లైంగిక లోపం ఉందనుకునే అపోహలు  ఎక్కువై పోవడంతో దాన్ని అధిగమించ డానికి వారు వయాగ్రాను ఆశ్రయిస్తున్నారు. నిజంగా ఎవరిలో నైనా లైంగిక సమస్యలున్నాయంటే అందుకు 80 శాతం కారణాలు మానసికమైనవే. మానసిక సమస్యల పరిష్కారానికి వయాగ్రా ఉపయోగం శూన్యం. ఒకవేళ శారీరక సమస్యలే కారణమైతే వాటికి వైద్య చికిత్సలు అవసరమవుతాయే తప్ప వయాగ్రా వినియోగం పరిష్కారం ఏమాత్రం కాదంటున్నారు. అకారణంగా వాడే వయాగ్రా వల్ల వచ్చే అనర్థాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయని నిజానికి లైంగికం గా ఏ లోపమూ లేని పాతికేళ్ళ లోపు యువకులే నేడు వయాగ్రాను అధికంగా వాడుతున్నారని సమాచారం. ఇది యువత అనుకున్నట్లుగా “శృంగార వాంచను రేకెత్తించే ఉత్ప్రేరకం”కాదు.


నిజంగా వయాగ్రా పురుషాంగానికి రక్త సరఫరాను పెంచేది మాత్రమే. యువకులకు దీని అవసరం ఏ మాత్రమూ లేదు. యవ్వనంలో “అంగస్తంభన” లోపం లాంటి సమస్యలు సాధారణంగా వారిలో ఉండవు. యువతలో అంగస్థంబన సమస్య ఉంటే దానికి మానసిక ఆందోళన మాత్రమే కారణం. ఇదే అప్పుడప్పుడూ వారిలో అంగస్తంభన లోపాలకు, శీఘ్రస్ఖలనాలకూ దారి తీస్తుంటాయి. అయితే వారిని అసత్యాలు అర్ధసత్యాలతో ముంచెత్తే లైంగ్క విఙ్జానం వారికి అది శారీరక సమస్యగా భావించేలా చేస్తుంది.


అంగస్తంభన లోపాలు గానీ, మరే ఇతర వ్యాధులు కానీ లేని వారికి ఏ ఉత్ప్రేరకమూ అవసరం లేదు. ఆరోగ్యకరమైన, ఆత్మవిశ్వాసం, తన లైంగిక సామర్థ్యం మీద నమ్మకం, “పాజిటివ్” గా స్పంధించే మనసే గొప్ప “లైంగిక ఉత్ప్రేరకాలు” అని తెలుసుకోవాలి.


*మధుమేహం,

*అధిక రక్తపోటు,

*గుండె,

* కాలేయం,

*ఊపిరితిత్తులు, ఆస్తమా,

*వెరికోసీల్, హైడ్రోసీల్,

*నాడీ సంబంధ వ్యాధులు,

*మూర్చ,

*అధిక కొలెస్ట్రాల్

 

ఇలాంటివి ఏవైనా ఉంటే అంగ స్తంభన సమస్య ఉత్పన్నమౌతుంది. అయితే ఈ వ్యాధులకు వాడే ఔషధాల వలన అంగస్తంభన, శీఘ్రస్ఖలన సమస్యలు వస్తాయి. మానసిక వ్యాధులు తగ్గడానికి వాడే “యాంటీ డిప్రెసివ్, యాంటీ సైకోటిక్ డ్రగ్స్”మారిజునా, గంజాయి  వాడకం  కూడా దీనికి మరో కారణం.

Image result for dangers of Viagra usage by youth 

అలాగే, సిగరెట్లు, జర్దా, గుట్కాల్లోని నికోటిన్- రక్తనాళాల గోడల్ని మందబార్చి అంగానికి రక్త సరఫరా తక్కువ చేస్తాయి. పెరిగిన కొలెస్ట్రాల్ వలన అంగస్తంభన శీఘ్రస్ఖలన సమస్యలు రావటం  జరుగుతుంది. ఈ పరి స్థితుల్ని వైద్య పరిభాషలో “అథిరో, ఆర్టీరియో స్లీరోసిస్” అంటారు. కాగా, ఆల్కహాల్ శృంగారాన్ని సహజంగా ప్రేరేపించే “టెస్టోస్టిరాన్ హార్మోన్‌”ఉత్పత్తిని తగ్గిస్తుంది.


అనుమానం పెనుభూతం అన్నట్లు - ఏ యువకుల్లోనైనా శృంగారం పట్ల అనుమానాలు, భయాలు ఆందోళనలు ఉంDaTam - లైంగిక విషయాలపై అశాస్త్రీయ పరిజ్ఞానం కూడా కారణాలుగా చెప్పవచ్చు.

 

ఉదాహరణకు అంగం పరిమాణం చిన్నగా ఉందని,

హస్త ప్రయోగం వల్ల అంగం సైజు చిన్నగా మారటంతో అయిపోయి చర్మం నల్లగా అయ్యి, మొటిమలు వస్తాయని, శీఘ్రస్ఖలనం, అంగస్తంభన సమస్యలు వస్తాయని,

వీర్యనష్టం వల్ల బలహీనత ,వీర్యకణాలు తగ్గిపోతాయనీ.

ఇలాంటి అజ్ఞానంతో, ఆందోళనను పెంచుకోవటం యువతలో శృంగార వైఫల్యానికి దారితీస్తాయి.

అనైతిక సంబంధాలు,

అసహజ లైంగిక ప్రక్రియలు,

బాల్యంలో లైంగిక వేధింపులకు గురికావడం,

స్వలింగ సంపర్కాలు,

దాంపత్య కలహాలు, విడాకులు,

ఒంటరి జీవితం,

ఆర్థిక సమస్యలు


ఇలాంటివి ఒత్తిడిని పెంచి, అంగస్తంభన లోపానికి, శీఘ్రస్ఖలనానికి దారితీస్తాయి. వయాగ్రా వినియొగం వలన ఎక్కువ సేపు 24-72 గంటల వరకు పాల్గొనే సామర్థ్యం పెరుగుతుందని అనుకుంటారు. ఈ అసహజ స్తంభన వల్ల జరిగే నష్టాల గురించి వారికి తెలియదు.వయాగ్రాతో అంగం పొడవు మామూలు కంటే కొంచెం ఎక్కువగా పెరుగుతుందని అనుకుంటారు. అంగం చిన్నగా, ముడుచుకు పోయిందని భయపడే వారు పరిష్కారంగా ఈ వయాగ్రాను ఎంచుకుని పొరబడతారు.


నిజానికి 18 సంవత్సరాల తర్వాత అంగం సైజు పెరిగే అవకాశమే లేదని వారికి తెలియదు. మాదక ద్రవ్యాలను కలిపి వయాగ్రా తీసుకోవడం వల్ల శృంగారంలో ఒక అద్భుతమైన పారవశ్యం కలుగుతుందని పొరబడతారు. వయాగ్రా వాడితే ఎయిడ్స్, సుఖరోగాలు రావనే అపోహ కూడా కొందరిలో ఉంది. అందుకే, వీరు కండోమ్స్ లేకుండానే “సెక్స్ వర్కర్స్” వద్దకు వెళతారు. ఈ అభిప్రాయాలన్నీ పూర్తిగా తప్పు.

 

అసలు వాడకూడని వారు ఎవరంటే? ఏ వ్యాధీ లేని వాళ్లు కూడా వయాగ్రా వాడడం వల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి. ఇక ఏదైనా వ్యాధితో ఉన్నవాళ్లు వయాగ్రా వాడితే అది మరీ ప్రమాదం.


గ్లిసరిన్ ట్రైనైట్రేట్ - నైట్రోగ్లిసరిన్, సోడియం నైట్రోపుసైడ్స్, అమైల్ నైట్రేట్స్ వాడుతున్న వాళ్లు, గుండె జబ్బులున్న వాళ్లు, గుండెపోటు, పక్షవాతం వచ్చిన వాళ్లు వయాగ్రాను వాడకూడదు.


కాలేయ వ్యాధి, కిడ్నీ సమస్యలు, మధుమేహం, అల్ప రక్తపోటు, వంశపారంపర్యంగా వచ్చే కంటి జబ్బులు, రెటినాకి సంబంధించి సమస్యలు ఉన్నవాళ్లు, లుకేమియా, హెచ్‌ఐవీ, ఎముక మజ్జకు సంబంధించిన కణతులున్న వారు, రక్తస్రావ వ్యాధులు, కడుపులో అల్సర్స్ ఉన్నవాళ్లు, పురుషాంగం వంకరగా ఉన్నవాళ్లు ఈ వయాగ్రా వాడకూడదు.


వాడితే ఏమవుతుంది, చెప్పినా వినకుండా వయాగ్రా మాయలో పడితే ఏమవుతుందంటే చాలా వరకు ఆరోగ్యనష్టం తప్పదు. తలనొప్పి, ముఖం, ఛాతీ, చేతులు వేడెక్కడం లాంటి ఫషింగ్, డిస్‌పెప్సియా, చూపు దెబ్బతినడం, అంధత్వం, ప్రతీది రెండుగా కనబడటం, అన్నీ నీలం రంగులో కనబడటం, నాన్- ఆర్టీరిక్, యాంటీరియల్ ఇస్కీమిక్ ఆప్టిక్ న్యూరోపతీ, చెవుడు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది.


దీర్ఘకాలంగా వయాగ్రా వాడే వారిలో కంటిచూపు కోల్పోవడం కన్పిస్తుంది. గుండె జబ్బున్న భార్యతో వయాగ్రా వేసుకొని ఎక్కువసేపు సెక్స్ చేయడం వల్ల ఆమెకు గుండెపోటొచ్చి తన మరణానికే ప్రమాదం ఏర్పడుతుంది. సున్నితమైన యోని పొరలు ఎక్కువ సేపు సెక్స్ చేయడం వల్ల అవి బాగా గాయపడి ఇన్ఫ్‌క్షన్స్ వస్తాయి.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: