ఎన్నో జ్ఞాప‌కాల‌తో కూడిన 2019 సంవ‌త్స‌రానికి గుడ్‌బై చెప్పి 2020కి ఘ‌న స్వాగ‌తం ప‌లికాం. కొత్త సంవ‌త్స‌రంలో కోరుకున్న ప‌నులు జ‌ర‌గాల‌ని, ఈ ఏడాది కూడా మంచి జ్ఞాప‌కాల‌తో సంతోషంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రు కోరుకుంటున్నారు.  కొత్త ఏడాది మంచి చేస్తుందని మన జీవితాలు సుఖమయం అవుతాయని ఆశ. ఆ చిగురంతా ఆశతోనే జగమంతా వేడుక చేసుకుంటుంది. ఇక న్యూ ఇయ‌ర్ అంటే..  పబ్‌లు, క్లబ్‌లు, పార్టీలు, ఫంక్షన్లు.. ఇలా అందరం ఆనందంలో మునిగితేలుతుంటాం. మ‌రోవైపు బంధుమిత్రులు పంపించే శుభాకాంక్షల సందేశాలు చదువుతూ కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. 

 

ఇక ఈ బిజీ లైఫ్‌తో ఇటీవ‌ల కాలంలో మిత్రుల‌కు, కుటుంబసభ్యులకు, శ్రేయోభిలాషులకు సెల్ ఫోన్ ద్వారా.. హెలో, వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా సందేశాలు పంపిస్తున్నాం. మరి ఆ సందేశం సాదాసీదాగా ఉంటే ఏం బాగుంటుంది? అందుకే, జనవరి 1న ఈ అందమైన కోట్స్‌తో మీ బంధుమిత్రులకు న్యూ ఇయర్ విషెస్ చెప్పండి. వాటిలో.. ``మధురమైన ప్రతి క్షణం.. నిలుస్తుంది జీవితం.. ఈ కొత్త సంవత్సరం.. అలాంటి క్షణాలెన్నో.. అందించాలని ఆశిస్తున్నారు.. మీకు, మీ కుటుంబ సభ్యులకు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు``.

 

``ఈ కొత్త సంవత్సరం.. మీ జీవితాల్లో వెలుగులు నింపాలి.. సరికొత్త విజయాలను అందించాలి.. ప్రతి ఒక్కరూ సంతోషంతో గడపాలి.. ప్రతి ఒక్కరికీ ఆనందాన్ని పంచాలని ఆ కాంక్షిస్తూ.. మిత్రులకు, శ్రేయోభిలాషులకు.. నూతన సంవత్సర శుభాకాంక్షలు`` మ‌రియు ``కష్టాలెన్నైనా సరే రానీ.. సవాళ్లెన్నైనా సరే ఎదురవనీ.. కలిసి నిలుద్దాం, కలబడదాం, గెలుద్దాం.. ఈ సంవత్సరం నీకు అప్రతిహతమైన గెలుపునందించే సంవత్సరం కావాలని ఆశిస్తూ.. నూతన సంవత్సర శుభాకాంక్షలు``.  హ్యాపీ న్యూ ఇయ‌ర్‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: