సాధార‌ణంగా ఏ ఇంటికైనా అందాన్నీ, ఆకర్షణనీ ఇచ్చేది రంగులే అన‌డంతో ఏ మాత్రం సందేహం లేదు. రంగుల్లో ఏముంది అంటూ.. మన మూడ్‌ను, ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేసే శక్తి ఉంది. ప్రతి ఇంటికీ రంగులు వేస్తుంటారు. ఈ రంగుల వల్ల ఆ ఇంటికి కొత్త అందం, హంగు వస్తుంది. ఒక ఇంటికి వేసిన రంగులను బట్టి ఆయా వ్యక్తుల అభిరుచులు, మనస్తత్వాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే బెడ్రూమ్ లో ఇప్పుడు చెప్ప‌బోయే రంగులు ఉండ‌డం వ‌ల్ల కొన్ని లాభాలు పొందొచ్చు.

 

సాధార‌ణంగా చాలా ఎక్కువ మంది ఎరుపు, గులాబీ రంగులు ప్రేమకు చిహ్నం కదా అని వాటిని ఎంపిక చేసుకుంటారు. అయితే వాటికంటే నీలం రంగు ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఓ స‌ర్వేలో తేలింది. చాలా మంది నీలం రంగునే ప్రశాంతమైనదిగా భావించారట. నీలం రంగు ఉన్న గదిలో వారు ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు చెప్పారని నిపుణులు చెబుతున్నారు.

 

ఇక నీలం రంగు తర్వాత అత్యంత ప్రభావితమైన రంగు పసుపు రంగు. పసుపు రంగును ఎక్కువగా ఆకలిని క‌లిగేలా ప్రేరేపిస్తుంది. అయితే పడక గదిలో సైతం ఈ రంగు మరింత ప్రేరేపితంగా ఉంటుందని అంటున్నారు. ఇలాంటి గదుల్లో నివసించే ప్రజలు సగటున 7 గంటల 40 నిమిషాలు నిద్రపోతున్నట్లు సర్వే పేర్కొంది. పసుపు రంగు మానసిక ప్రశాంతతను ఇస్తుందని, దీని వల్ల శృంగార జీవితం కూడా బాగుంటుందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: