పెళ్లి అనేది ఒక సాంస్కృతిక సార్వజనీన కార్యం. అయితే భారతీయ సాంప్రదాయక వివాహ వేడుకలలో పసుపు చందనానికి అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వబడింది. ఉత్తర భారత దేశంలో కొన్నిచోట్ల పసుపు(న‌లుగు) ఫంక్షన్‌, మెహందీ ఫంక్షన్ పెద్ద వేడుక‌గా చేసుకుంటారు. మన తెలుగువారు ప్ర‌త్యేకించి ఫంక్ష‌న్‌గా కాక‌పోయినా పెళ్లికి ముందు గోరింటాకు పెట్ట‌డం, ప‌సుపు రాసి మంగ‌ళ‌స్నానం చేయించ‌డం మ‌న పెళ్లిళ్ల‌లోనూ ఉన్న‌దే. అయితే పెళ్లిళ్ల‌లో పెళ్లి కూతురికి, పెళ్లి కొడుకుకి పసుపు ఎందుకు పెడ‌తారు అన్న విష‌యం చాలా మందికి అవ‌గాహ‌న లేక‌పోవ‌చ్చు. అలాంటివారికి ఇప్పుడు ఖ‌చ్చితంగా స‌మాధానం దొరుకుతుంది.

 

పసుపును దంపతుల ఆరోగ్యకర వైవాహిక జీవితానికి చిహ్నంగా భావించబడుతుంది. భారతీయ సంస్కృతీ సాంప్రదాయాల ప్రకారం, ముత్తైదువులందరూ కలిసి వధూవరులిద్దరికీ పసుపును రాయడం ద్వారా దీవెనలను అందించడం అనేది పురాతనకాలం నుండి వస్తున్న ఆచారం. దీన్ని పెళ్ళికి ముందు గంధం నలుగు, లేదా నలుగుగా జరుపబడుతుంది. అలాగే పసుపు ముఖంపై ఏర్ప‌డే మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటి వాటిని తొలగించ‌డంలో బాగా ప‌నిచేస్తుంది. 

 

వివాహ కార్య‌క్ర‌మంలో పాల్గొనే వ‌ధూ వ‌రులు మ‌రింత ప్ర‌కాశ‌వంతంగా క‌నిపించాలనే ఉద్దేశంతోనే ప‌సుపును వారికి రాసి స్నానాలు చేయిస్తారు. అంతేకాకుండా.. ప‌సుపులో క‌ర్క్యుమిన్ అన‌బ‌డే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌ల‌ను త‌గ్గిస్తుంది. అవి లేకుండా ఉంటేనే క‌దా ఎవ‌రైనా ఉత్తేజంగా ఉండేది. అందుకోస‌మే వ‌ధూవ‌రుల‌కు ప‌సుపు రాస్తారు. మ‌రియు శ‌రీరంలో చేరిన దుష్ట శ‌క్తుల‌ను పార‌దోలే ప‌వ‌ర్ పసుపుకి ఉంద‌ట‌. అందుకే వ‌ధూవ‌రులపై ఎలాంటి గాలి, ధూళి లేకుండా ఉండేందుకు కూడా ప‌సుపు రాస్తారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: