సాధారణంగా చాలా మందికి కొన్ని అలవాట్లు ఉంటాయి.. ఉదయం లేవగానే హాట్ హాట్ గా ఒక కప్పు కాఫీ లేదా టీ తాగాలని అనుకుంటారు. అలా చేయలేపోతే వారికి రోజు మొదలైనట్లు కూడా ఉండదు..అలాంటి వాళ్ళు ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. ఏది పడితే అది తాగితే శరీరానికి చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఈ టీ ని రోజు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..



కరి వేపాకు.. ఈ ఆకును మనం తరచూ కూరల్లో చూస్తుంటాము..దాన్ని తినేటప్పుడు పక్కన పడెస్తాం.. అయితే ఆ ఆకులో ఉండే పోషకాలను వింటే అసలు వదలరు.కరివేపాకులో విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్స్, కాపర్, ఐరన్, ఫైబర్ మాత్రమే కాక ఇంకా ఎన్నో ఎస్సెషియల్ న్యూట్రియెంట్స్ ఉన్నాయి.బరువు తగ్గడానికీ, శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించే డీటాక్సిఫికేషన్ అనే ప్రక్రియకూ కరివేపాకు చాలా సాయం చేస్తుంది. అందుకనే, బరువు తగ్గాలని ప్రయత్నించే వారు తప్పని సరిగా కరివేపాకుని వారి ఆహారం లో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతూ ఉంటారు. అంతే కాక, కరివేపాకు లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వలన కరివేపాకు ఇమ్యూనిటీ బూస్టర్ లా కూడా పని చేస్తుంది.



ఇకపోతే ఈ కరివేపాకు తో టీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఈ టీకి కావలసిన పదార్థాలు:


ఎనిమిది నుండి పది కరివేపాకులు

అరంగుళం అల్లం ముక్క

రెండు మూడు కప్పుల నీరు

తేనె

తయారీ విధానం:

ముందుగా కరివేపాకును నీటితో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి..ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ లో వాటర్ వేసి, అందులో అల్లం ముక్క వేసి బాగా మరిగించాలి.తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాలు చల్లారనివ్వాలి. ఇప్పుడు నీటిని వడకట్టి అందులో తేనె లేదా నిమ్మరసం వేసుకొని ఉదయాన్ని గ్లాస్ తాగితే ఉదర సమస్యల తో పాటుగా అధిక బరువును కూడా ఇట్లే తగ్గించుకోవచ్చు.. చూసారుగా కరివేపాకే కదా అని తీసి పారెయ్యకుండా ఇప్పటి నుంచి తినడం మొదలు పెట్టండి..


మరింత సమాచారం తెలుసుకోండి: