సీజన్ మారే కొద్ది రకరకాల వ్యాధులు కూడా ప్రబలుతుంటాయి..వాటిని ఇంట్లోనే ఉన్న వాటిని ఉపయోగించి చిటికెలో ఉపశమనం పొందవచ్చు..అందులో ఒకటి ఉల్లిపాయ టీ కూడా. ఉల్లిపాయలు వంటల్లో రుచిని ఇవ్వడమే కాక, మంచి ఆరోగ్యాన్నిచ్చే ఎన్నో లక్షణాలను ప్రేరేపిస్తుందట.అయితే ప్రస్తుతం చలికాలంలో చాలా మంది జలుబు, తగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారంతా తక్షణ ఉపశమనం కోసం ఈ ఉల్లిపాయ టీ తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఆనియన్ టీ రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావంతంగా పనిచేస్తుందని పరీశోధనలో కూడా వెల్లడైందట..
ఉల్లి టీ లో ఎన్నో గుణాలు ఉన్నాయట.. మరి ఇప్పుడు ఉల్లి తో టీ ని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం..ఒక గ్లాసు నీరు మరిగించి అందులో తరిగిన ఉల్లిపాయ, 2-3 నల్ల మిరియాలు, 1 యాలుకతో పాటు సగం చెంచా సోపు గింజలను జోడించాలి. దీనిని 15-20 నిమిషాల పాటు మరగించి తర్వాత వడకట్టుకుని తాగాలి.
ఉల్లి తొక్కతో టీ.. టీ పొడి లేదా గ్రీన్ టీ ఆకులు వేసి నీటిని మరగించాలి, ఆ తర్వాత మరిగించిన నీటిని చిన్న ఉల్లిపాయ లేదా సగం ఉల్లిపాయ తొక్కలు తీసి ఉంచుకున్న కప్పులో పోయాలి.. ఆ తొక్కను సుమారు పది నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత నీటిని వడకట్టి తేనె, నిమ్మరసం వేసుకొని తాగాలి..ఎంతో రుచి తో పాటుగా మంచి ఫలితాలు కూడా ఉంటాయి..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి