సాధారణంగా చిలగడదుంప తినేవారు, దాన్ని ఉడకబెట్టిగానీ లేదా కాల్చిగానీ తింటుంటారు. ఇలా ఉడకబెట్టడం/ కాల్చడం చేశాక తినేటప్పుడు దానిపైన పింక్ రంగులో కనిపించే పొట్టును ఒలిచి తింటుంటారు. కానీ చిలగడదుంప పైన ఉండే పొట్టులో కెరటినాయిడ్స్ అనే పోషకాలు ఉంటాయి. ఇవి నోరు, ఫ్యారింగ్స్, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించడానికి బాగా తోడ్పడతాయి..
అంతేకాదడోయ్.. వీటి తో పాటుగా బీటా కెరోటిన్ అనే మరో పోషకం ఈసో ఫేగల్ క్యాన్సర్ ను నివారిస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి తోడ్పడే జీర్ణవ్యవస్థ కు సంబంధించిన అన్ని రకాల క్యాన్సర్లను నివారించడానికి తోడ్పడుతుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నందున ఈ పింక్ రంగు లో ఉండే పొట్టును ఒలిచి పారేయకుండా తినేయండి... కేవలం చిలకడ దుంపలు మాత్రమే కాదు.. కొందరు యాపిల్ , సపోటా లను కూడా తొక్క వలచి తింటారు. ఏదైనా తొక్క లోనే ఎక్కువ పోషకాలు దాగివున్నాయి. చూసారుగా తొక్క పై ఉన్న మురికిని తీసి తినాలి కానీ తొక్కలను తీసేస్తే ఇక గుజ్జును తిన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి