దోసకాయలను కట్ చేశాక ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అందులోని పోషకాలు తగ్గిపోతాయి. కాబట్టి దోసకాయ ముక్కలను తినడానికి బదులు.. చలవ చేసేందుకు కంటిపై రుద్దుకునేందుకు మాత్రమే వాడ టం మంచిది.
ఇకపోతే బ్రెడ్.. బ్రెడ్‌ను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అది డ్రైగా మారుతుంది. ఎక్కువ రోజులు అలాగే ఫ్రిజ్‌లో పెడితే బూజు పట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి వీలైనంత వరకు బ్రెడ్‌ను గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడం మంచిది.
బిస్కెట్లు, కాక్లెట్లు, పండ్లు, ఆకుకూరలు, పచ్చి కొబ్బరి, పాలు, పెరుగు, కొబ్బరి నీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. కండ్లు, చెవుల్లో వేసుకునే చుక్కల మందును కూడా ఫ్రిజ్‌లో ఉంచవచ్చు..ఆలుగడ్డలను ఫ్రిజ్‌లో ఉంచినప్పుడు వాటిపై తొక్కలోని తేమ ఆవిరై గట్టిపడుతుంది. దీనివల్ల ముక్కలు తరగడం కష్టమవుతుంది. అలాగే లోపల ఉండే పిండి పదార్థం తేమను పూర్తిగా కోల్పోతుంది. ఫలితంగా వంటకాలు రుచి పచి లేకుండా చప్పగా ఉంటాయి. అంతేకాకుండా ఫ్రిజ్‌లో ఉండే చల్లని ఉష్ణోగ్రతల కారణంగా ఆలుగడ్డల్లో చక్కెర శాతం త్వరగా పెరిగే అవకాశం ఉంది... ఇంక పుదీనా, ఉల్లిగడ్డలు, టమాటాలు, పుచ్చకాయలు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టకూడదట..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి