టామోటాలు తినడం చాలా మందికి అలవాటు.. పుల్లగా, కొద్దిగా తియ్యగా ఉండటం తో  చాలా మంది వీటిని తినడానికి ఇష్ట పడతారు. అందుకే ఈ మధ్య కూరల్లోకి కొనడం కన్నా తినడానికి ఎక్కువగా కొనేవాళ్లను నిపుణులు అంటున్నారు. టమోటాలను అలానే తీసుకున్నా కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట.. అవేంటో ఒక్కసారి చుద్దాం.. 

టమాటోస్‌ లో విటమిన్ ఎ, సి, కె, బి 1, బి 3, బి 5, బి 6, బి 7 వంటి సహజ విటమిన్లు, ఖనిజాలు నిండి ఉంటాయి. ఇందులో ఫోలేట్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, క్రోమియం, కోలిన్, జింక్, భాస్వరం కూడా పుష్కలంగా ఉంటాయి. టమోటా అంత శక్తి వంతమైన కాయలు. అందుకే అందానికి మంచి మెడిసిన్ అని చెప్పాలి. మరో ముఖ్యమైన విషయమేంటంటే తొక్క తో సహా వీటిని తినాలి. టమోటాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టమోటాల్లోని లైకోపీన్ ముఖ ప్రక్షాళనగా పనిచేస్తుంది. మీ చర్మాన్ని రిఫ్రెష్ చేస్తుంది. ఈ టమోటాల లో ఎక్కువగా ఏ విటమిన్ ఉంటుంది. దీంతో జుట్టు ను బయట ప్రపంచం నుంచి కాపాడుతుంది. దుమ్ము, దూళి నుంచి రక్షిస్తుంది. విటమిన్ కె, కాల్షియం, లైకోపీన్ ఎముకల ను సరిచేయడానికి, బలోపేతం చేయడానికి ఎముకల బరువును పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ టమోటాలు క్యాన్సర్, క్యాన్సర్ సంబంధిత వాటిని నిర్మూలించాడానికి ఉపయోగ పడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచడం లో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి. అందుకే టమోటాల ను తీసుకోవడం వల్ల కరోనా లాంటి రోగాలు కూడా రావని తెలుస్తుంది. అంతేకాదు, ఉదర సమస్యలను తగ్గిస్తుంది. దాంతో పాటుగా చర్మ సౌందర్యాన్ని మెరుగు పరుస్తుంది.. ఏదైనా మితంగా తింటే ఆరోగ్యం అనేది గుర్తుంచుకోవాలి..  మీరు కూడా టమోటాలను తినడం మొదలు పెట్టండి.. ఆరోగ్యాన్ని పెంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: