ప్రతిరోజు ఉదయాన్నే కొన్ని తులసి ఆకులను నమలడం వల్ల శరీరంలో నుండి విషవాయువులు తొలగిపోతుంది. అంతేకాకుండా తులసి శరీర ఉష్ణోగ్రతను కూడా చాలా తగ్గిస్తుంది. దీంతో బరువు క్రమ క్రమంగా తగ్గుతూనే ఉంటారు. వర్షాకాలం వచ్చినప్పుడు తులసి కషాయం గా పనిచేస్తుంది. ఈ కషాయం తాగడం వల్ల జలుబు, గొంతు సమస్య నుండి విముక్తి పొందవచ్చు.
ప్రతిరోజు ఉదయం తులసిని ఏమి తినకుండా తీసుకుంటే.. కడుపు నొప్పి సమస్య, బరువు సమస్య నుండి బయటపడవచ్చు.
1). కొబ్బరి నీళ్ళలో కి తులసి ఆకులు, కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల కడుపు నొప్పి నుండి విముక్తి లభిస్తుంది.
2). తులసి ఆకులతో టీ చేసుకొని తాగడం వల్ల జీర్ణ సమస్యల నుండి బయట పడవచ్చు.
3). ప్రతి రోజు ఈ ఆకులను తినడం వల్ల చర్మ వ్యాధులు, అనేక వ్యాధుల నుండి బయటపడవచ్చు.
4). షుగర్ ఉన్నవారు ప్రతిరోజు 2 లేదా అంతకంటే ఆకులను నమిలి ఆ రసాన్ని మింగటం వల్ల, చక్కెర స్థాయి సమతుల్యంగా ఉంటుంది.
5). మనకు జ్వరం వచ్చినప్పుడు ఉదయంపూట ఖాళీ కడుపుతో ఈ తులసి నీరు తాగడం వల్ల, ఎటువంటి వైరస్ సంక్రమణ జరగకుండా ఉంటుంది.
6).ముఖ్యంగా చలికాలంలో గొంతు నొప్పి వచ్చినప్పుడు ఈ నీటిని తాగడం వల్ల, ఎంతో స్పష్టంగా మాట్లాడగలం.
చూశారా.. తులసి మొక్క వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. అయితే మీరు కూడా ఈ విధంగానే చెయ్యండి. ఇక అధిక బరువు, వర్షా కాలంలో వచ్చే జ్వరాలు వంటి ఎన్నో సమస్యల నుంచి బయట పడవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి