ముఖ్యంగా ఆ కాలంలో చీమల బెడద తక్కువగా ఉండేది అని చెప్పవచ్చు.. ఎందుకంటే ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేయడం వల్ల బయట నుంచి వచ్చిన చీమలు ఆ పిండిని తిని అటే వెళ్ళిపోయేవి. కానీ ప్రస్తుత కాలంలో ఇంట్లో ఎక్కడ చూసినా సరే చీమల బెడద ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా వంటింట్లో ఏ పదార్థంలో చూసినా సరే ఈ చీమలు పుట్టలు పుట్టలుగా పేరుకొని పోయి ఉంటాయి.. ఇక వీటి బెడద నుంచి తప్పించుకోవడానికి గృహిణులు ఎంత తంటాలు పడినా వీటి బెడద నుంచి తప్పించుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ చీమల బెడద నుంచి తప్పించుకోవాలంటే ఇప్పుడు చెప్పబోయే కొన్ని వంటింటి చిట్కాలను పాటించి చూడండి..


వంటింట్లో దొరికే దినుసులతోనే దాల్చినచెక్క చాలా సువాసన భరితమైనది. చీమలకు వీటి వాసన అస్సలు నచ్చదు.. ఎక్కడైతే చీమలు కన్నాలు ఏర్పాటు చేసుకున్నాయో,  అక్కడ ఈ దాల్చిన చెక్క పొడిని వేయడం వల్ల అవి అక్కడి నుండి వెంటనే వెళ్లిపోతాయి. చెక్క పొడిని నీళ్లలో కలిపి చీమలు వచ్చే చోట చల్లితే అవి రాకుండా ఉంటాయి.. తలుపులు, కిటికీల దగ్గర కూడా మూలల్లో దాల్చినచెక్క ఉంచడం వలన చీమల తో పాటు ఇతర పురుగులు కూడా ఇంట్లోకి చేరవు.


వెనిగర్ కూడా చీమలను చంపడానికి బాగా పనిచేస్తుంది. వెనిగర్ లో కొద్దిగా నీళ్లు కలిపి చీమలు వస్తున్న చోట చల్లడం వల్ల వెంటనే అక్కడి నుంచి చీమలు వెళ్లి పోతాయట.


బోరాక్స్ పొడిని కూడా ఇంట్లో ఉండే చీమలు , పురుగులను దూరం  చేయడానికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. గోరువెచ్చని నీటిలో కొద్దిగా బోరాక్స్ పౌడర్ కలిపి పురుగులు , చీమలు వస్తున్న ప్రదేశంలో చల్లడం వల్ల వెంటనే అవి వాటి దారిని మార్చుకుంటాయి.అంతేకాదు బోరాక్స్ పొడి వల్ల ఒక్కోసారి చీమలు చచ్చిపోతాయి కాబట్టి.. ఈ టిప్స్ పాటిస్తే తప్పకుండా మీ ఇంట్లో చీమల బెడద ఉండదు.


మరింత సమాచారం తెలుసుకోండి: