పసుపును కేవలం వంటింట్లో కూరలలో మాత్రమే వాడడం కాదు.. పసుపు సర్వరోగనివారిణి కూడా.. ముఖ్యంగా మన పెద్దవాళ్ళు ఆ కాలంలో అయితే పసుపును పండించి.. వచ్చిన ఆ పసుపు కొమ్ములను నీటిలో నానబెట్టి , ఎండబెట్టిన తరువాత.. రుబ్బి పొడిచేసి పెట్టుకునేవాళ్ళు. అయితే ఈ కాలంలో ఎవరి పనిలో వారు బిజీ బిజీగా ఉంటున్న సమయంలో .. ఇక పసుపు కొమ్ములను ఎండబెట్టి పొడి చేసుకునేంత సమయం కూడా లేదు.. కాబట్టి మార్కెట్లో ఇలాంటి వారి కోసమే ప్యాకెట్ రూపంలో మనకు పసుపు పొడి లభ్యమవుతోంది. అయితే మనం మార్కెట్లో తెచ్చుకుని పసుపు శుద్ధమైనదా.. లేదా..అని తెలుసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..


ఉదయం లేచినప్పుడు మనం తాగే పాల నుంచి ఉప్పు, కారం, పసుపు, నూనె ఇలా ప్రతి ఒక్కటి కూడా కల్తీ అవుతున్న నేపథ్యంలోని ఇలాంటి కల్తీ ఆగడాలను ఆటపట్టించడం కోసమే..  FSAAI ప్రజల కోసం ఈ కల్తీ నుంచి బయట పడాలంటే కొన్ని జాగ్రత్తలు సూచిస్తోంది. అయితే ముఖ్యంగా మనం పసుపు యొక్క స్వచ్ఛతను పరీక్షించడం కోసం నాలుగు దశలు ఉంటాయి.. దానిని మీరు కూడా ఒకసారి చూసి తెలుసుకోండి..

ముందుగా ఒక గ్లాసు నిండా నీళ్లు తీసుకోవాలి.

అందులో కొద్దిగా పసుపు పొడిని కలపండి.

ఒకవేళ మీరు తీసుకున్న పసుపు కనుక కల్తీ అయినట్లయితే , నీరు మరింత పసుపు రంగులోకి మారి.. పసుపు స్థిరంగా కింద అడుగు భాగంలోకి చేరుకుంటోంది. దీనిని మనం గుర్తించవచ్చు..

ఈ పద్ధతి ద్వారా మీ పసుపు నీళ్ళు మరింత పసుపు గా మారినట్లు అయితే , పసుపు కల్తీ  అయిందని గుర్తించి వెంటనే మీరు వాడుతున్న బ్రాండ్ ను మార్చడమే ఉత్తమం..

పసుపే కాదు మరే ఇతర పదార్థాలను అయినా ముందుగా కల్తీ అవుతున్నాయా లేదో చెక్ చేసిన తర్వాత వాడుకోవడం అలవాటు చేసుకోవాలి..ఇక సేంద్రీయ పద్ధతుల ద్వారా పండించిన పసుపును వాడటమే ఆరోగ్యానికి ప్రయోజనకరం...


మరింత సమాచారం తెలుసుకోండి: