ఇల్లు చాలా శుభ్రంగా ఉండాలని , ఎంత మంది ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నా.. వారాంతం వచ్చేసరికి దుమ్ము, ధూళి తో ఇల్లు మొత్తం పేరుకుపోతుంది..ఇక సాలీడు గూళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక కొన్ని పనులు ఎలా చేసుకోవాలో మనకు తెలియక పోవడం వల్ల డబ్బు అనేది ఎక్కువగా వృధా అవుతుంది. ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఇల్లు అందంగా ఉండడమే కాకుండా మీరు కూడా ఆరోగ్యంగా ఉండవచ్చు.. అయితే ఆ చిట్కాల గురించి మనం కూడా ఒకసారి తెలుసుకుందాం..

ముఖ్యంగా ఇంటిని శుభ్రం చేసేటప్పుడు అద్దాన్ని కూడా శుభ్రం చేస్తూ ఉంటాము.. అద్దం శుభ్రం చేసేటప్పుడు ఒక మెత్తటి కాటన్ క్లాత్ తీసుకుని వేడి నీటిలో అద్ది, అద్దం పై క్లీన్ చేయడం వల్ల చక్కగా మెరవడంతో పాటు అటు ఎక్కువ కాలం అందంగా కనిపిస్తుంది.

ఎవరైనా అద్దాలు క్లీన్ చేసేటప్పుడు, క్లీనింగ్ ఎలిమెంట్స్ ను డైరెక్ట్ గా అద్దంపై చల్లి, ఆ తర్వాత క్లీన్ చేస్తూ ఉంటారు.. అలా చేయడం వల్ల అద్దం త్వరగా పాడవుతుంది.

ముఖ్యంగా పుస్తకాలు పెట్టుకునే అల్మరాలలో చిన్న చిన్న పురుగులు, సాలీడులు వచ్చి అల్మరాలను పాడు చేయడమే కాకుండా ఆ పుస్తకాలను కూడా ఆ చిన్న చిన్న పురుగులు తినేస్తూ ఉంటాయి.. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు చందనం పొడిని చల్లడం వల్ల పురుగులు పట్టవు.

స్కూల్ కి వెళ్ళే పిల్లలు తెల్లని షూస్ వేసుకుంటారు.. కాబట్టి వాటిపై ఉండే మరకలు ఎంత తిక్కినా పోవు.. అలాంటప్పుడు నెయిల్ పాలిష్ రిమూవర్ లో దూది అద్ది షూ పైన ఉండే మరకల పైన తిక్కడం వల్ల మరకలు తొలగిపోయి తెల్లగా తయారవుతాయి.

ఇక సాలీడు గూళ్లను తొలగించడం కోసం నిమ్మరసం కలిపిన నీటిని సాలీడు గూళ్ళు వచ్చే ప్రదేశంలో చల్లడం వల్ల ఐదు వారాల వరకు ఆ ప్రాంతంలో సాలీడు గూళ్ళు ఉండవు.. నిమ్మరసం  లేనప్పుడు వెనిగర్ ను కూడా వాడవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: