ఈ మధ్య కాలంలో చాలా మంది మార్కెట్లో దొరికే పచ్చిబఠానీలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.. బఠానీలలో ఉండే పోషకాల విషయానికి వస్తే, ఫైటో న్యూట్రియంట్స్,విటమిన్ ఏ ,విటమిన్ సి, విటమిన్ ఈ, విటమిన్ బి వంటి పోషకాలు సమృద్ధిగా లభించడమే కాకుండా ఫైబర్ కూడా అత్యధిక మొత్తంలో వీటి ద్వారా మనకు లభిస్తుంది. పచ్చి బఠానీలలో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది..కాబట్టి ప్రతి ఒక్కరు పుష్కలంగా వీటిని తీసుకోవచ్చు. కొవ్వు శాతం లేనందున శరీరంలో కొలెస్ట్రాల్ చేరే అవకాశం కూడా ఉండదు.. ఎవరైనా సరే పోషకాల కోసం ఈ పచ్చిబఠానీలను ఆహారంలో ఒక భాగంగా చేసుకోవచ్చు.


ఈ పచ్చిబఠానీలను సహజంగా దొరికే వాటిని తీసుకుంటే ఈ ప్రయోజనాలు కలుగుతాయి.. కానీ మార్కెట్లో దొరికే పచ్చిబఠానీలను రంగులతో కల్తీ చేస్తారు కాబట్టి ఈ రంగు కలిపిన బఠాణీలను తినడం వల్ల మన శరీరానికి లేనిపోని హానికరం జరిగే ప్రమాదం కూడా ఉంటుంది.. మనకు మనం గమనించినట్లయితే.. మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పచ్చిబఠానీలను నీళ్లలో వేయగానే నీళ్లు మొత్తం ఆకుపచ్చరంగులో మారిపోతాయి. దీన్నిబట్టి గమనించవచ్చు..  పచ్చిబఠాణీలు కల్తీ అయ్యాయని.

కచ్చితంగా పచ్చిబఠానీలు కల్తీ అయ్యాయా లేదా అనే విషయాన్ని ఎలా తెలుసుకోవాలంటే.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల పచ్చిబఠానీలలో కల్తీ రంగు ను ఎలా గుర్తించాలో మనకు కొన్ని సూచనలను ఇచ్చింది ..అవేంటో ఇప్పుడు మనం కూడా చదివి తెలుసుకుందాం..

ముందుగా ఒక గాజు బౌల్ తీసుకొని, అందులో నీళ్ళు వేసి పచ్చి బఠాణీలు వేసి , ఒక అర గంట పాటు వదిలేయాలి.

ఒకవేళ ఆ నీరు పచ్చరంగు లోకి మారితే, ఆ బఠాణీ లు రంగుతో  కల్తీ  అయినట్టు.. సాధారణంగా పచ్చ బఠాణీలు ఎటువంటి కలర్ ను విడువవు.

వీటిని కాయలతో సహా కొన్నప్పుడు ఎటువంటి ప్రమాదం జరగదు.. ఇక విడిగా మార్కెట్ లో కొన్నప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి.. కాబట్టి వీలైనంత వరకు ఈ పచ్చిబఠానీలను మార్కెట్ లో కాకుండా డైరెక్టుగా కాయలతో సహా కొనడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మార్కెట్లో దొరకకపోతే, ఎండిపోయిన బఠాణీలను తీసుకొచ్చి, మీరు వంటలో వాడడానికి రెండు గంటల ముందు నానబెట్టి ఉపయోగిస్తే సరిపోతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: