మనం ఏదైనా చేయాలి అంటే.. ముందుగా ఆరోగ్యంగా ఉండాలి..అప్పుడే ఏ పనైనా చేయడానికి సులభంగా ఉంటుంది. ఇక మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరానికి కూడా అవసరమైన పోషకాలు అన్నింటిని పొందడం తప్పనిసరి. ఆరోగ్యంగా ఉండాలి అంటే విటమిన్ డి శరీరానికి అధికంగా అవసరమౌతుంది.. ఇక ఆఫీసులో పనిచేసే వారు విటమిన్-డి తక్కువ అవుతుంది కాబట్టి.. అలాంటి వాళ్ళు విటమిన్-డి టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలా తీసుకోవడం వల్ల ఎంత ప్రమాదకరమో తెలిసినప్పటికీ తప్పని పరిస్థితుల్లో టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు.

డి విటమిన్ మనకు టాబ్లెట్ రూపంలో కాకుండా సహజంగా లభించాలి  అంటే సూర్యరశ్మి నుంచి పొందవచ్చు అని అందరికీ తెలిసిన విషయమే. విటమిన్-డి ఉంటేనే మన శరీరంలో ఎముకలు దృఢంగా తయారవుతాయి.. దంతాలు కూడా ఆరోగ్యంగా ఉండటానికి సహాయ పడతాయి. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే విటమిన్-డి చాలా అవసరం. విటమిన్-డి లోపం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా ఏర్పడతాయట.ఎలా కనుక్కోవచ్చు అనే విషయానికి వస్తే బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా విటమిన్-డి లోపాన్ని తేలికగా మనం కనుక్కోవచ్చు

కొంత మంది రీసెర్చర్లు నాలుక ద్వారా కూడా విటమిన్-డి లోపాన్ని గుర్తించవచ్చు అని తెలిపారు.. నోట్లో.. నాలుక నొప్పి కలగడం లేదా మంటపుట్టడం , రుచి తెలియకపోవడం, నోరు వాచిపోవడం , సరిగ్గా మాట్లాడలేక పోవడం వంటి ఇబ్బందుల వల్ల మనకు విటమిన్-డి లోపం కలిగిందని తెలుసుకోవచ్చట. శరీర తత్వాన్ని బట్టి విటమిన్-డి లోపం తెలుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు సూర్యకిరణాలలో ఎంత సమయం ఉండాలి.. ఎప్పుడు ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఇక 70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్ళకి విటమిన్-డి 600 iu అయ్యుండాలి. 70 సంవత్సరాల పైబడిన వారు అయితే 800 iu డి-విటమిన్ ఉండేలా చూసుకోవాలి. ఇక ప్రతి రోజూ ఉదయం 10 నిమిషాల నుండి 20 నిమిషాల వరకు ఎండలో ఉంటే సరిపోతుంది. 7 గంటల నుండి ఎనిమిది గంటల లోపు వచ్చే సూర్యకిరణాలను ఆస్వాదించడం వల్ల మనలో డి విటమిన్ లోపం ఉండదు అని వైద్యులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: