రేపు అనగా నవంబర్ 4వ తేదీన దీపావళి పండుగను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు దేశ ప్రజలంతా సిద్ధమయ్యారు. ఇక ఈ పండగకి ముఖ్యంగా రంగురంగుల దీపాలను వెలిగించడం ఒక ప్రత్యేకత. అయితే ఈ పండుగ రోజున దీపాలు ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా వెలిగిస్తే ఏం జరుగుతుందో అనే విషయం కూడా ఇప్పుడు చూద్దాం.

దీపాన్ని వెలిగించేటప్పుడు ఎప్పుడైనా సరే దక్షిణం వైపుకు తిప్ప కూడదట. అలా చేస్తే మనకు అరిష్టం కలుగుతుందట. దీపావళి రోజున దీపాలను ఆవు నెయ్యి తో నే వెలిగించడం మంచిది. ఇలా వెలిగించడం చాలా మంచిదని పండితులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా దీపాలను వెలిగించడానికి పొద్దుతిరుగుడు నూనెను ఉపయోగించకూడదట. ముందుగా దీపాన్ని పూజగదిలో ని వెలిగించడం మంచిదట. పండుగ రోజున లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే.. గుమ్మానికి అటువైపు ఇటువైపు దీపాలను వెలిగించి ఉంచాలట.

మనం రంగురంగుల లైట్లను వేసేటప్పుడు వీలైతే ఎక్కడ ఉంచాలో అనే విషయాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం అని కొంతమంది వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు. ఇంటికి తూర్పువైపున నారింజ, పసుపు రంగు దీపాలను ఉంచడం శుభానికి చిహ్నమట. పడమర వైపున అయితే.. గులాబీ రంగు, నారింజ దీపాలను వెలిగించడం మంచిది. ఉత్తర దిక్కున అయితే.. నీలం, ఆకుపచ్చ, పసుపు వంటి రంగుల దీపాలను వెలిగించడం మంచిదట. దక్షిణ దిక్కున అయితే.. తెలుపు, ఎరుపు రంగు దీపాలను వెలిగిస్తే చాలా మంచిదని వాస్తు నిపుణులు తెలియజేస్తున్నారు.

దీపావళి రోజున రెండు వత్తులు వేసి దీపాలను వెలిగించి ఇంటి బయట తులసికోట దగ్గర పూజామందిరంలో, కాంపౌండ్ పైన ,ఉత్తరదిక్కు ముఖంగా దీపాలను వుంచాలట. ముఖ్యంగా మట్టి ప్రమిదలతో దీపాలు వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే చెడు అంతా బయటికి పోయి, మంచి చేకూరుతుందని పండితులు చెబుతున్నారు. మీకు ఇంకా కుదిరితే పిండితో చేసిన దీపాలను కూడా పెట్టడం మహా శుభకరం. ఇక ఇత్తడి దీపాలను కూడా ఈ దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి ముందు వెలిగించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: