దేశరాజధానిలో పూర్తిగా కాలుష్యం విస్తరించిందని నివేదికలు తేల్చిచెపుతున్నాయి. ఇప్పటికే అక్కడ వాతావరణంలో పెరిగిన కాలుష్యం వలన కనీసం శ్వాస తీసుకోవడానికి కూడా పనికిరాని స్థితిలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. అందుకే రాజధానిలో దీపావళి వేడుకలు కూడా పూర్తిగా నిషేదించారు. దేశానికీ రాజధాని ఆయిన ఢిల్లీ లో ఇలాంటి పరిస్థితి దేశ పరువును తీసేస్తున్నట్టే ఉంది. ఇక ఢిల్లీ సరిహద్దులలో రైతులు పంట పొలాలలో వృదాను తగలబెట్టినప్పుడు వచ్చే పొగ కూడా ఢిల్లీకి వ్యాప్తిస్తుంది. వాళ్ళు వాడుతున్న రసాయనిక ఎరువుల వలన కావచ్చు, కనీసం ఆ పొగ ను కూడా తట్టుకునే స్థితిలో రాజధాని లేదు. ఈ కాలుష్యం వలన తీవ్రంగా ఉష్ణోగ్రతలతో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అక్కడ నివసిస్తున్న వారిలో ఎక్కువ శాతం మందికి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. ఇందుకు భారత్ వెంటనే రాజధానిలో సరైన నిబంధనలు అమలు చేయకుంటే జీవన ప్రమాణాలు దిజగారిపోయే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితిలో భాగస్వామి అయిన స్విట్జర్లాండ్ కు చెందిన వాతావరణ నివేదిక సంస్థ ఐక్యూ.ఎయిర్ నుండి ఈ తరహా అభిప్రాయాలు వెలువడ్డాయి.  

ఈ సంస్థ నివేదిక ప్రకారం భారత్ లో అత్యంత ప్రమాదకరంగా కాలుష్యానికి గురవుతున్న ప్రాంతాలు మూడు తేలాయి. అవి ఒకటి ఢిల్లీ కాగా కలకత్తా, ముంబై తరువాత స్థానాలలో ఉన్నాయి. ఈ నగరాలలో కనీస గాలి నాణ్యత, కాలుష్య వివరాలతో కూడిన జాబితా సంస్థ విడుదల చేసింది. కాలుష్యం కారణంగా తాజాగా ఢిల్లీలో గాలి నాణ్యత సూచి(ఏ.క్యూ.ఐ) 556 ను తాకింది. ఈ స్థాయిలో కాలుష్యం అనారోగ్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటికే అనేక వ్యాధులతో బాధపడేవారిపై ఇంకా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. తాజా ప్రభావం మరో 48 గంటల పాటు ఉండనుందని కాలుష్య బోర్డు స్పష్టం చేసింది. ఐక్యూ.ఎయిర్ నివేదిక ప్రకారం మొదటి పది కాలుష్య నగరాలలో ఢిల్లీ మొదటి స్థానంలో ఉందట, కలకత్తా నాలుగో స్థానంలో, ముంబై ఆరవ స్థానంలో ఉంది.

రెండొవ స్థానంలో పాక్ ప్రాంతంలో ఉన్న లాహోర్ నిలువగా; చైనా లోని చెంగ్డు నగరం 8వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ నగరాలలో పరిస్థితి అద్వాన్నంగా ఉన్నట్టు ఐక్యూ.ఎయిర్ సంస్థ నివేదిక తేల్చింది. మొదటి పది స్థానాలలో ఉన్న నగరాల జాబితా లో ఢిల్లీ(భారత్). లాహోర్(పాక్), సోఫియా(బల్గెరియా), కలకత్తా(భారత్), జాగ్రెబ్(క్రొయేషియా), ముంబై(భారత్), బెల్గ్రేడ్(సెర్బియా), చెంగ్డు(చైనా), స్కోప్జే(ఉత్తర మాసిడోనియా), క్రాకో(పోలాండ్) ఉన్నాయి. దీపావళి తరువాత ఢిల్లీ లో ఘోరంగా కాలుష్య సూచికలు పెరిగిపోయాయి. ఒక్క కు.మీ. కు పీఎం2.5 గాఢత 329(నిజానికి 60 ఉండాలి) మీ.గ్రా. ఉంది. ఇందులో 15 శాతం వరిపొట్టు మండించడం వలన అని అధికారులు గుర్తించారు. గృహాల నుండి 7 శాతం, వాహనాలు నుండి 25 శాతం, పరిశ్రమల నుండి 35 శాతం కాలుష్యానికి కారణం అవుతున్నాయి.  ప్రపంచ స్థాయిలో ఢిల్లీ మొదటి స్థానంలో నిలవడం ఆందోళల కలిగించే విషయం. ఈ సూచికల వెనుక రాజకీయాలు లేకుండా ఉంటెనే ఇది నిజం అయినట్టు లేదంటే కానట్టే. కాలుష్యం రాజధానిలో ఉన్న మాట నిజం కావచ్చు కానీ, ప్రపంచంలో మొదటి స్థానం అంటేనే అనుమానాలు వస్తున్నయి. భారత్ పై లేనిపోని అపోహలు రేపటానికి అతి చిన్న విషయాన్ని కూడా శత్రువులు వాడేసుకుంటున్న సమయం ఇది. అందుకే అనుమానాలు తప్పవు.

మరింత సమాచారం తెలుసుకోండి: