శీతాకాలంలో శరీరం వెచ్చగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం తెలిసిందే. ఇక ప్రతిరోజు సరైన ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం కూడా చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి ఆరోగ్యంగా ఉండడానికి ఈ ఆహారం, వ్యాయామం రెండూ ఉపయోగపడతాయి.. చలికాలం కూడా దగ్గర పడుతుంది కాబట్టి శరీరాన్ని వెచ్చగా వుంచడానికి పలు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.


ముఖ్యంగా ఈ చలికాలం లో చేతులు , కాళ్ళు కూడా చల్లబడతాయి కాబట్టి వాటిని వెచ్చగా ఉంచుకోవడానికి దుస్తులతో పాటు ఫుల్ స్లీవ్ వేసుకోవాలి..ఇక బయటకు వెళ్ళినప్పుడు కాళ్ళకు, చేతులకు సాక్స్ ధరించడం తప్పనిసరి. అదనంగా మెడకు టర్టిల్ నెక్  నెక్ లైన్ ను  తప్పకుండా ధరించాలి. దీనిని ధరించడం వల్ల మెడ భాగంలో కూడా వెచ్చగా ఉంటుంది. చలికాలంలో ఉన్ని దుస్తులను తప్పకుండా ధరించడం వల్ల శరీరానికి వెచ్చదనం లభించడమే కాకుండా శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి అవయవాలు ఆరోగ్యంగా ఉండటానికి ఈ ఉన్ని దుస్తులు సహాయపడతాయి.

ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ బాగా పెరిగి శరీరంలో వేడి పెరుగుతుంది. వ్యాయామం చేసేటప్పుడు శరీరం నుంచి చెమటలు వస్తాయి కాబట్టి శరీరం వెచ్చగా ఉంటుంది. ఇక ప్రతి రోజు ఉదయం వ్యాయామం చేయడం వల్ల చలికాలంలో చలి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.


ఉన్ని దుస్తులు ధరించినప్పటికీ మీకు చలిగా ఉన్నట్లయితే హీటింగ్ ప్యాడ్ ను ఉపయోగించవచ్చు. ఇలా హీటింగ్ ప్యాడ్ లను ఉపయోగించడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది..కాబట్టి చలి నుంచి త్వరగా తప్పించుకోవచ్చు.

క్యాల్షియం వల్ల శరీరంలో ఉండే వేడి శరీరం లోపల లాక్ చేయబడుతుంది..కాబట్టి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.. ముఖ్యంగా వేడి నీటిలో ఉప్పు వేసి పదిహేను నిమిషాల పాటు కాళ్లు  ఉంచడం వల్ల శరీరానికి వేడి లభించడంతో పాటు రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: