నెలసరి అనగానే మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు అని మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నెలసరి సమయంలో కొంతమంది మహిళలకు వాంతులు అయితే మరికొంతమంది మహిళలకు ఓవర్ బ్లీడింగ్ అవడం, కళ్ళు తిరగడం, తలనొప్పి, అలసట, విపరీతమైన కడుపు నొప్పి రావడం, వంటి సమస్యలు తలెత్తడంతో పాటు మరికొంతమంది లో కాళ్లు, చేతులు వాచే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది కాబట్టి కండరాల పై ఎక్కువ ఒత్తిడి పడటం వల్ల నొప్పి కూడా అధికమవుతుంది.

సాధారణంగా పీరియడ్స్ సైకిల్ 28 రోజులు అయితే.. ప్రతి ఒక్కరికి ఒకే లాగా ఉంటుందని చెప్పడం అసాధ్యం. కాబట్టి నొప్పి కూడా ఒక్కొక్కరిలో ఒక్కో లాగా ప్రభావితం అవుతుంటుంది. ఇకపోతే చాలామంది తెలిసీ తెలియక కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకూడదని చెబుతూ ఉంటారు. ఇలా తీసుకొని పదార్థాలను తీసుకోవడం వల్ల కొంతమందికి నొప్పి ఎక్కువైతే, మరి కొంతమందికి నొప్పి తగ్గుతుంది అని చెబుతారు వైద్యులు. అయితే ఈ పీరియడ్స్ సమయంలో కొన్ని పదార్థాలను అస్సలు తినకూడదట. అవేంటో ఇప్పుడు మనం ఒకసారి చదివి తెలుసుకుందాం..

ఇకపోతే పుల్లటి పదార్థాలను తీసుకోవడం వల్ల నొప్పి ఎక్కువ అవుతుంది అని చెప్తారు కానీ ఇది అపోహ మాత్రమే.. యూట్రస్ లో టేస్ట్ బడ్స్ ఉండవు కాబట్టి తప్పకుండా పుల్లటి పదార్థాలను తీసుకోవచ్చు. దీని వల్ల మనకు ఎలాంటి ప్రభావం ఉండదట. అయితే నేరుగా కాకుండా మీకు ఒకవేళ పుల్లటి పదార్థాలు తినాలనిపిస్తే పచ్చళ్ళు, నిమ్మకాయ , పుల్లటి చాక్లెట్లు వంటివి తినవచ్చు. ముఖ్యంగా పీరియడ్స్ వచ్చినప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్కహాల్ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఆకుకూరలు, పండ్లు, డార్క్ చాక్లెట్, నట్స్ వంటివి ఆహారంగా తీసుకోవచ్చు. కాబట్టి ఈ సారి మీకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి. ఒకవేళ కడుపునొప్పి మరీ ఎక్కువైతే హీటింగ్ ప్యాడ్ ఉపయోగించడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: