జనాభా తగ్గుదల విషయంలో చైనా మాదిరిగానే భారత్ కూడా సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నది. ఇటీవల కాలంలో జనాలు రేటు గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న కుటుంబ నియంత్రణ కార్యక్రమం నేపథ్యంలో మొత్తం సంతానోత్పత్తి రేటు భారీగా తగ్గింది. గత కొన్ని ఏళ్లుగా జనాభా తగ్గుముఖం పడుతోందని నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 తాజా గణాంకాలు వెల్లడించాయి.2019-21లో సగటు భారతీయ మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. దేశ సంతానోత్పత్తి రేటులో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప స్థాయి ఇది. అంతేగాక, తొలిసారిగా సంతానోత్పత్తి రేటు రిప్లేస్మెంట్ రేటు కంటే దిగువకు పడిపోవడం ఆందోళనకరమని పేర్కొంది. ఐదో ఎడిషన్ సర్వేను రెండు విడతలుగా విడుదల చేశారు. తొలి విడత గణాంకాలను గతేడాది డిసెంబర్లో బయటపెట్టగా..రెండో విడత వివరాలను తాజాగా వెల్లడించారు. దీని ప్రకారం దేశంలో సంతానోత్పత్తి రేటు  2గా ఉంది. రిప్లేస్మెంట్ రేటు అంటే జనాభాలో ఎటువంటి తగ్గుదల, పెరుగుదల ఉండకపోవడం.

దేశంలో జనన, మరణాలను బ్యాలెన్స్ చేసే స్థాయిగా దీన్ని పేర్కొంటాయి.ఇప్పుడు మనదేశంలో సంతానోత్పత్తి రేటు అంతకంటే తక్కువగా ఉండటంతో జనాభాలో తగ్గుదల మొదలైందని సర్వే చెబుతోంది.అప్పట్లో సగటు భారతీయ మహిళ తన జీవిత కాలంలో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది ఆ తర్వాత క్రమంగా ఇది తగ్గుతూ వస్తుంది. తాజా డేటా సంతానోత్పత్తి,కుటుంబ నియంత్రణ, వివాహ వయస్సు,మహిళా సాధికారతకు సంబంధించిన అనేక సూచనలపై గణనీయమైన పురోగతిని చూపుతోంది. ఇవన్నీ
 టిఎఫ్ఆర్ తగ్గడానికి దోహదం చేశాయి.ఏదేమైనా ఆధునిక గర్భనిరోధక పద్ధతులు ప్రస్తుత వినియోగంలో గణనీయమైన పెరుగుదల ఉందని ఈ సర్వే కనుగొంది. పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రేజా ప్రకారం స్త్రీల స్టెరిలైజేషన్ లో పెరుగుదల, కుటుంబ నియంత్రణ బాధ్యత మహిళల పైనే ఉందని చూపిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో మనకు ఉన్నటువంటి ఆహారపు అలవాట్ల వలన అటు పురుషుల్లో ఇటు మహిళలలో సంతానోత్పత్తి రేటు తగ్గడం వలన  జనాభా కూడా తగ్గుతూ వస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: