పెళ్లిళ్ల సీజన్ దగ్గర్లో ఉంది కాబట్టి మీ దగ్గర ఇప్పుడు చెప్పబోయే నగలు ఉన్నాయో లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోండి.
1. పాపిడి బిళ్ళ:
పేరుకు తగ్గట్టుగానే పాపిడి మధ్యలో పాపిడి బిల్లలు పెట్టుకుంటారు. ఒక చైన్ కి ముందర ఒక పెద్ద పెండెంట్, రెండోవైపు చిన్న హుక్ కలిగి ఉంటుంది. ఇక హుక్ ను జుట్టుకి పెట్టేసి పెండెంట్ నుదట మీదకి వచ్చేలా పాపిడి బిళ్ళలు పెట్టుకోవడం వల్ల అమ్మాయి అందం మరింత రెట్టింపు అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు . అయితే ఈ పాపిడిబిళ్ళ పెట్టుకోవడం వల్ల దిష్టి తగలకుండా అమ్మాయి చాలా చక్కగా కనిపిస్తుంది అని పెద్ద వాళ్ళు నమ్ముతారు.
2. నడుముకు వడ్డాణం:
నడుముకి వడ్డాణం పెట్టడం వల్ల అమ్మాయి అందం మరింత రెట్టింపు అవుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వడ్డానం బాగా ట్రెండ్ నడుస్తోంది కాబట్టి ఇంట్లో జరిగే శుభకార్యాలకు తప్పకుండా వడ్డానం పెట్టుకోవాలి. అంతేకాదు మరోవైపు హారంలో కూడా వేసుకునే వడ్డాణాలు కూడా ప్రస్తుతం మనకు లభ్యమవుతున్నాయి.
3. అరవంకీ:
ఇది లేనిదే పెళ్లికూతురు అలంకరణ పూర్తి కాదని చెప్పవచ్చు . ముఖ్యంగా గోరింటాకు పెట్టిన చేతులమీదుగా అరవంకీ మెరుస్తూ ఉంటే ఆ చేతిని అందుకోవాలని పెళ్ళికొడుకు ఆరాట పడుతూ ఉంటాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి