మన దేశంలో ఎన్నో ప్రముఖ గ్రంథాలయాలు ఉన్నాయి. ముఖ్యంగా కలకత్తా లో ఉన్న రాజారామ్మోహన్ రాయ్ గ్రంథాలయం అసియా లో ఉన్న అతిపెద్ద గ్రంథాలయం. అలాగే, ప్రపంచంలో ఉన్న అతి పురాతనమైన మరియు దక్షిణాసియా లో అతి పెద్ద చేతి రాతల గ్రంథాలయం కూడా ఉంది. ఇంతకీ ఆ గ్రంథాలయం కథ కమీషూ ఏంటో చూద్దాం రండి. 
మహారాష్ట్ర ఆటోమొబైల్
రాజధాని పుణె లో వందేళ్లు దాటిన భవనం ... ఆ భవనంలోనే ఉంది చేతి రాత గ్రంథాలయం. పేరు భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ సంస్థ (B.O.R.I). దీని వ్యవస్థాపకులు 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ
మరాఠా మేధావి
రామకృష్ణ గోపాల్ భండార్కర్. 1917 లో దీన్ని నెలకొల్పారు. ఇందులో వందల ఏళ్ల కిందటి గ్రంథాలు..వాటి సంఖ్య సుమారు రెండున్నర లక్షల పైమాటే.

ఆ గ్రంథాయలం లోని పుస్తకాలన్ని అరుదైనవే. అందులో అన్ని రాత ప్రతులే! పూరాణలకు సంబంధించిన మరియు సనాతన ధర్మం యొక్క వాజ్మయం మొత్తం అక్కడే ఉంది. భండార్కర్ తన
జీవిత కాలంలో సేకరించిన అతి పురాతన గ్రంథాలు, రాత ప్రతులను ఈ గ్రంథాలయం లో ఉంచారు. వీటిలో చాలా వరకు సంస్కృతం, ప్రకృతం భాషలకు చెందినవే ఉండటం విశేషం.

ఇప్పుడు ఈ రాత ప్రతులు, గ్రంథాలన్నీ జీర్ణావస్థకు చేరుకోవడంతో గ్రంథాలయం నిర్వాహక్కులు వాటన్నింటినీ డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ చేపట్టారు. తొలుత 20వేల గ్రంథాలను , మలివిడతలో మరికొన్ని డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేసి ప్రస్తుతం వీటిని ఆన్ లైన్ లో సంస్థ వెబ్సైట్ నుందు అందుబాటులో ఉంచారు. ఇందు కోసం సుమారు 4 ఏళ్ళు 15 మంది సభ్యుల బృందం మూడు షిఫ్ట్ ల్లో పనిచేస్తూ సుమారు 2 లక్షల ప్రతులను, గ్రంథాలను స్కానింగ్ చేశారని నిర్వాహకులు పేర్కొన్నారు.
స్కానింగ్ చేసిన గ్రంథాలను ఎప్పటికప్పుడు ఈ-లైబ్రరీలో ఉంచుతున్నారు. రానున్న రోజుల్లో అన్ని ప్రతులను, పుస్తకాలనూ స్కానింగ్ చేసి , భావితరాల కోసం భద్రపరుస్తాం అంటున్నారు నిర్వాహకులు. మన
చరిత్ర గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోవాలనుకునే వారు ఒకసారి అక్కడికి వెళ్ళండి