కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి దృష్టి పరిశుభ్రత పైనే వుంటోంది. ఈ క్రమంలోనే చాలామంది చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమే  కాకుండా తమను తాము ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా చేతులు కడుక్కోవడం అనేది మొదటి ప్రాధాన్యత కిందకు వస్తుంది. అయితే చేతులు కడుక్కోవాలి అని ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే.. అయినా చాలా మంది ఈ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పటినుంచీ జాగ్రత్త వహించాలని ప్రతి ఒక్కరు హ్యాండ్ వాష్ చేసుకోనిదే ఏ పని చేయడం లేదు.

అయితే మీకు ఇష్టమైన హ్యాండ్ వాష్ ను మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.. ఎలాగంటే మీరు ప్రతి రోజూ ఉపయోగించే సబ్బు ముక్కలు చివర్లో మిగిలిపోతే వాటిని ఉపయోగించడం కష్టంగా ఉంటుంది . కాబట్టి అలాంటి వాటి తో మీరు సులభంగా ఇంట్లోనే హ్యాండ్ వాష్ తయారు చేసుకోవచ్చు. ఇక ఇందుకోసం మీరు ఎలాంటి ఖర్చు చేయవలసిన అవసరం ఉండదు. ఇలా మిగిలిపోయిన సబ్బు ముక్కల తో హ్యాండ్ వాష్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ముందుగా శుభ్రమైన నీటిని.. ఉపయోగించని ఒక గిన్నెలో తీసుకుని దానిని స్టౌ మీద పెట్టాలి. నీరు మరిగేటప్పుడు ఆ నీటిలో సబ్బు ముక్కలను వేసి నురుగు వచ్చే వరకు బాగా మరిగించాలి. ఇక మీ హ్యాండ్ వాష్ మరింత ప్రభావవంతంగా ఉండడానికి ఇందులో మీరు గ్లిజరిన్ అలాగే రోజ్ వాటర్ ని కలపడం అసలు మర్చిపోవద్దు. ఆ నీరు బాగా చిక్కబడేవరకు కాసేపు అలాగే ఏదైనా టేబుల్ స్పూన్ సహాయం తో కలుపుతూ ఉండాలి. ఎప్పుడైతే హ్యాండ్ వాష్ చిక్కగా మారడం ప్రారంభిస్తుందో.. అప్పుడు గ్యాస్ ను ఆఫ్ చేయాలి. మీకు కావాలంటే ఇందులో మీకు ఇష్టమైన నూనెను జోడించవచ్చు. పర్ఫ్యూమ్ లేకుండా చేతులు కడుక్కోవడం అనేది అసంపూర్ణంగా భావిస్తారు చాలామంది కాబట్టి లావెండర్ ఆయిల్ లేదా పెప్పర్ మింట్ ఆయిల్ ఇందులో కలుపుకోవచ్చు. చల్లారాక రెగ్యులర్ గా దీనిని ఉపయోగించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: