1). నీటిని ఎక్కువగా తాగడం:
ఎక్కువ మొత్తంలో నీరు తాగడం వల్ల ఎన్నో సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.. వీటి వల్ల ఆకలి కూడా వేయదు. రోజులో కనీసం తగిన వ్యవధిలో నీటిని తీసుకోవడం వల్ల ఆకలి నియంత్రించవచ్చు.
2). గుడ్డు తినడం:
ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలనుకున్నప్పుడు గుడ్డును మాత్రమే తీసుకోవాలి.. ఇందులో పౌష్టిక ఆహారమైన గుణాలు ఉంటాయి. ఇక అంతే కాకుండా బ్రేక్ఫాస్ట్ సమయంలో వీటితోపాటు సోయాబీన్స్ కూడా తీసుకోవచ్చు.
3). బాదం పప్పులు:
ఆకలిగా అనిపించినప్పుడు బాదంపప్పును తినడం చాలా మంచిది. దీనివల్ల మనకు ఆకలి వేయడం తగ్గుతుంది. ఇందులో విటమిన్ -E, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడం వల్ల ఆకలి వేయదు.
4). అవిసె గింజలు:
ముఖ్యంగా అవిసెగింజల లో ఫైబర్ మరియు కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. అందుచేతనే వీటిని తినడం వల్ల అధిక ఆకలిని కలిగించవచ్చు.. అందుచేతనే వీటిని సలాడ్ లో చేర్చుకొని కనీసం ఒకసారైనా తాగితే వీటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
5). భోజనం చేసే ముందు వ్యాయామం:
భోజనం చేసే ముందు నీటిని తాగడం వల్ల ఆకలి వేయడం తగ్గుతుంది.. అంతే కాకుండా వ్యాయామం చేయడం కూడా ఆకలి నియంత్రించవచ్చు. ఎందుచేత అంటే అలసట వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ భోజనాన్ని తినలేము.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి