వేసవికాలంలో ఎక్కువగా చాలామంది చల్లటి పానీయాలు తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా వేసవి కాలం వచ్చింది అంటే పెరుగుకు చాలా డిమాండ్ ఉంటుంది.. భారతీయ వంటగదిలో ఏడాది పొడవునా ఉండేది కేవలం పెరుగు మాత్రమే.. వేసవి వేడిని తట్టుకోవడానికి అంటే పెరుగు పూర్తిగా అవసరం పడుతుంది. కాబట్టి చాలామంది పెరుగు తో తయారు చేసిన వంటకాలను ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతారు.. పెరుగు అనేది వేసవి కాలంలో చాలా మందికి ప్రాణదాత అని చెప్పవచ్చు. ఎంతోమంది ఇంట్లో పెరుగు తయారు చేయడంలో ఇబ్బంది పడుతున్నారనే విషయం అందరినీ బాగా ఇబ్బంది పెడుతోంది . ఇకపోతే ఇంట్లో కేవలం కొన్ని టిప్స్ పాటిస్తే చాలు మీరు కూడా సులభంగా తయారు చేయవచ్చు.

మీకు కావల్సింది కేవలం ఒక లీటరు ఆవుపాలు.. చిన్న టేబుల్ స్పూన్ పెరుగు..

ఎలా తయారు చేయాలి అంటే.. పాలను ఒక గిన్నెలో పోసి..  స్టౌ మీద పెట్టి వెలిగించి చిన్నటి ఫ్లేమ్ మీద పాలను బాగా చిక్కబడే వరకు మరగనివ్వాలి. పాలు పూర్తిగా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా చేయాలి. బాగా మరగబెట్టిన పాలను ఒక పాన్  నుంచి మరొక పాన్లో కి మూడు నుంచి నాలుగు సార్లు ఒక దాంట్లో నుంచి మరొక దాంట్లోకి మార్చాలి. ఇలా చేయడం వల్ల పాల నురుగు బాగా వస్తుంది. పాలలో కొద్దిగా పెరుగు వేసి మరో రెండు సార్లు కలపాలి. ఇప్పుడు మట్టి పాత్రలో లేదా మందపాటి గిన్నెలో పోసి ఎనిమిది గంటలపాటు రాత్రిపూట వెచ్చని ప్రదేశంలో ఉంచితే చాలా చక్కటి గడ్డపెరుగు తయారవుతుంది. ఇక వెంటనే ఫ్రిజ్ లో పెట్టవచ్చు. పెరుగు యొక్క నాణ్యత కూడా పాల చిక్కదనం పై ఆధారపడి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నీళ్లు కలపకుండా తోడు వేసినప్పుడే చిక్కటి గడ్డ పెరుగు వస్తుంది. మీరు కూడా ఈ చిట్కా పాటిస్తే చక్కటి గడ్డ పెరుగు ఇంట్లోనే తయారు చేయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: