శరీరంలో చాలా ముఖ్యమైన భాగాలలో కిడ్నీ కూడా ఒకటి. వీటి పని శరీరంలో రక్తం నుండి విష పదార్థాలను తొలగించడమే.. ఈ హానికరమైన వ్యర్థ పదార్థాలు మూత్రం రూపంలో మన శరీరం  నుండి బయటికి వెళ్ళి పోయేలా చేస్తూ ఉంటాయి. దీంతో మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కిడ్నీలు బాగా పని చేయవలసి ఉంటుంది. చాలాసార్లు మూత్రపిండాల లోపల వ్యాధికి గురవుతూ ఉంటుంది. ఇటువంటి సమయంలోనే మనం kidney function test చేయించుకోవడం చాలా అవసరము. మీ కిడ్నీ ఎంత ఆరోగ్యంగా వుందో..సరిగ్గా పని చేస్తుందో లేదో దీని ద్వారా తెలుసుకోవచ్చు.

డాక్టర్ ఆతుల్ మాట్లాడుతూ.. మూత్రపిండ పనితీరు పరీక్షలు రెండు విభాగాలుగా విభజించడం జరిగింది. అందులో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి గుర్తించడం.. మరొకటి వ్యక్తి శారీరక సంకేతాలు లేదా లక్షణాలను బట్టి వ్యాధిని గుర్తించడం. ఇటువంటి సమయాలలో కాస్త లోతుగా వ్యక్తి కాలేయ ఆరోగ్యాన్ని పరీక్ష చేయడం జరుగుతుంది అని తెలియజేశారు. స్కిన్నింగ్, యూరిన్ టెస్ట్, యూరిన్ ఆల్బమిన్ టు క్రియాటినిన్ తదితర వాటిని ఈ టెస్ట్  ద్వారా కిడ్నీ ప్రభావితమైందా లేదా అని గుర్తించవచ్చు.

ముఖ్యంగా కిడ్నీ పరీక్ష ఎప్పుడు చేయించుకోవాలంటే..
కిడ్నీ వ్యాధి లక్షణాలు చాలా ఆలస్యంగా బయటపడతాయి  అని డాక్టర్ ఆతుల్ తెలియజేస్తున్నారు. రోగి డాక్టర్ దగ్గరకు వచ్చే సమయానికి 90 శాతం వరకు మూత్రపిండాలు క్షీణిస్తాయి అని తెలియజేశారు. ఇందుకు కారణం ఇన్ఫెక్షన్స్, రాళ్లు మొదలైన వాటి వల్ల తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఎదురవుతాయట. ముఖ్యంగా కడుపునొప్పి, జ్వరం వంటి సాధారణ లక్షణాలను వెంటనే గుర్తించాలి. అయితే దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులలో ఎక్కువగా కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశాలు చాలా ఏక్కువగా ఉంటాయని తెలియజేశారు. అందుకు గల కారణం మధుమేహం , రక్తపోటు.  ఈ రెండు వ్యాధులలో మూత్రపిండాల్లో సమస్య చాలా నిశ్శబ్దంగా ఉంటుందట. ఇలాంటి వాటిని కేవలం స్కిన్నింగ్ టెస్ట్ ఆధారంగానే గుర్తించడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: