వేసవికాలంలో నేలపై పడుకోవడం వల్ల చాలా చల్లగా అనిపిస్తుందని కొన్ని అధ్యయనంలో తెలియజేయడం జరిగింది. ఇక అంతే కాకుండా నేలపై పడుకోవడం వల్ల మంచి నిద్ర కూడా వస్తుంది. ఎందుచేత అంటే నేల చల్లగా ఉంటుంది కనుక శరీరంలోని వేడిని త్వరగా తగ్గిస్తుంది. అయితే ప్రస్తుతం ఎక్కువగా అందరూ ఏసీ, కూలర్ వంటివి ఉన్నవారు ఎక్కువగా బెడ్ రూం లో పడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. కానీ అప్పట్లో మాత్రం ప్రతి ఒక్కరూ ఎక్కువగా కింద పడుకోడానికి చాలా మక్కువ చూపేవారు. ఇలా కింద పడుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.


1). కింద పడుకోవడం వల్ల వెన్ను నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. అయితే వెన్నునొప్పి ఉండేవారు భూమి ఉపరితలం పైన మాత్రమే నిద్రించాలి. చదునైన ప్రదేశంలో పడుకోవడం ద్వారా నొప్పి నుండి త్వరిత ఉపశమనం పొందవచ్చు. అయితే కొంతమంది చాప మీద కూడా పడుకుంటూ ఉంటారు. అలా పడుకొని మీరు పరుపు మీద పడుకోవాలి అనుకుంటే నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. అందుచేతనే బొంతలు వాడటం చాలా మంచిది.

2). నేలపై పడుకోవడం వల్ల శరీర భంగిమ చాలా సక్రమంగా పనిచేస్తుంది. అయితే అడ్డదిడ్డంగా పడుకోవడం వల్ల వెన్నునొప్పి సమస్య తీవ్రమవుతోంది కాబట్టి వెన్నుముక నిటారుగా ఉంచి నేలపై పడుకోవడం వల్ల వెన్నెముక సమస్యలు ఏమి ఉండవు.

3). అయితే వృద్ధులు నేల మీద మాత్రం పడుకోకూడదు. ఎందుకంటే వారికి నడకలో సమస్య.. ఎముకలకు సంబంధించిన సమస్యలు.. అలర్జీ వంటివి వస్తాయి. ఇక అంతే కాకుండా లేచి కూర్చోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉండే వాళ్ళు నేల మీద నిద్ర పోకపోవడమే మంచిది.

4). అయితే నేలమీద పడుకోవాలి అనుకొనేవారు ముందుగా నేల ను శుభ్రంగా చేసి పడుకునే చోట మురికిగా లేకుండా నేలమీద చాప  వేసుకొని నిద్రించడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: