మనం ఇంటిని  రోజు శుభ్రం చేస్తున్నప్పటికీ మళ్లీ దుమ్ము వస్తూనే ఉంటుంది. దీనితో చాలా మందికి చాలా చిరాకుగాను, చూడటానికి కూడా మంచిగా ఉండదు. అంతే కాదు ఆ దుమ్మును కనుక శుభ్రం చేయకపోతే, ఇంట్లో ఉన్న ఫర్నిచర్  అలాగే వస్తువులు కూడా పాడైపోవటం జరుగుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో  దుమ్ము ఇంట్లోకి రాకుండా చర్యలు తీసుకుంటూ కొన్ని చిట్కాలు పాటిస్తే అయితే ఇంటిలోని కష్టమైన ప్రదేశాలను సులభంగా శుభ్రం చేయడమే కాకుండా ఇంటిని దుమ్ము లేకుండా నీట్ గా ఉంచవచ్చు.

ఇంట్లో దుమ్ము లేకుండా చేయాలి అంటే ఈ క్రింది చిట్కాలు పాటిస్తే సరిపోతుంది..

సీలింగ్ ఫ్యాన్‌ శుభ్రం చేయడం: సీలింగ్ ఫ్యాన్ బ్లేడ్‌లపై పేరుకుపోయిన దుమ్ము , ధూళిని శుభ్రం చేయడం కోసం పాత దిండు కవర్ తీసుకుని అందులో ప్యాన్ బ్లేడ్ వేసి రుద్దుతూ తుడవడం వలన దిండు కవర్ లో ప్యాన్ దుమ్ము, ధూళి పడుతుంది. దీనితో మంచం అలాగే నేల శుభ్రంగా ఉంటాయి.

ల్యాప్‌టాప్ కీబోర్డ్‌: ల్యాప్‌టాప్ కీబోర్డ్‌పై ప్రతిరోజూ దుమ్ము కణాలు పడుతూనే ఉంటాయి. వీటిని క్లీన్ చేయడానికి  బేబీ వైప్‌లను ఉపయోగించి లేదా బ్లో బాల్ సహాయంతో కూడా ఈజీగా శుభ్రం చేయవచ్చు.

టీవీ : టీవీని  మైక్రో ఫాబ్రిక్ టవల్ లేదా స్క్రీన్‌ను సాఫ్ట్‌నర్‌లో నానబెట్టడం వలన కూడా శుభ్రం చేయవచ్చు. ఇంకా గ్లాస్ టేబుల్స్,  కిటికీలు, డోర్లు, అద్దాలను క్లీన్ చేయాలంటే, ఒక గిన్నెలో పార్ట్ ఫాబ్రిక్ సాఫ్ట్‌నర్‌ను 4 భాగాల నీటితో కలిపి దానిలో వస్త్రాన్ని ముంచి శుబ్రపరిచి తర్వాత పొడి వస్త్రం తో తుడిస్తే సరిపోతుంది.

విండో మెష్: ఇంటి కిటికీ లేదా తలుపు మెష్‌ లపై దుమ్ము ఉన్నట్లైతే స్టీల్ బ్రష్‌ సహాయంతో శుబ్రం చేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వలన మెష్ నుండి దుమ్ము పోయి శుభ్రంగా ఉంటుంది. అంతేకాదు వీలైతే పైపు సహాయంతో నీటితో కూడా శుభ్రం చేయవచ్చు.

పైన చెప్పిన చిట్కాలు కనుక పాటించినట్లైతే ఇంటిని దుమ్ము ధూళి నుండి శుభ్రంగా ఉంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: